రేడియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
 
==ప్రజాజీవనంలో వైర్ లెస్==
మార్కోనీ కనుగొన్న పరికరం మాత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ప్రజా జీవనంలో దీని మహత్తర ఉపయోగాన్ని ఎలుగెత్తి చాటే సంఘటనలు కొన్ని జరిగాయి. 1909 లో రెండు పడవలు సముద్ర మధ్యంలో ఢిఢీ కొన్నాయి. వైర్ లెస్ ద్వారా తీరానికి సమాచారం వెంటనే అందించకపోయి ఉంటే 1700 మంది ప్రయాణీకులు మునిగిపోయే వారు. ఒకసారి డాక్టర్ క్రిపెన్ అనే హంతకుడు ఇంగ్లండ్ నుండి కెనడా కి వెళ్ళే ఓడలో ప్రయాణం చేస్తుండగా ఆ ఓడ అధికారి వైర్ లెస్ ద్వారా ఈ సమాచారాన్ని స్కాట్లండ్ యార్డ్ కి తెలిపాడు. ఫలితంగా ఆ ఓడ కెనడా చేరగానే పోలీసులు అతడిని బంధించారు.
 
==టైటానిక్ ఓడ - SOS సందేశం==
ఈ శతాబ్దం ప్రారంభ దశలో తొలి అంతర్జాతీయ వైర్ లెస్ సమావేశం జరిగింది. ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు సహాయం అర్థించడానికి SOS అనే సంకేతాన్ని ఉపయోగించాలని తీర్మానించారు. అందరూ అనుకున్నట్లుగా ఈ సంకేతానికి అర్థం (save our souls) మమ్మల్ని రక్షించండి అనికాదు. మోర్స్ కోడ్ ప్రకారం ఈ మూడు అక్షరాలను మూడు చుక్కలు,మూడు డాష్ లు, మూడు చుక్కలుగా సూచిస్తారు. ప్రసారం చేయటానికి సులువుగానూ, సరళంగానూ ఉంటుందని సంకేతాన్ని ఇలా నిర్ణయించారు. 1912 ఏప్రిల్ లో [[టైటానిక్]] అనే ఓడ సముద్ర మధ్యంలో ఓ మంచు కొండ ను ఢీకొంది. ఓడ మునిగి పోతుండగా అక్కడి ఆపరేటర్ వైర్ లెస్ ద్వారా SOS సంకేతాలను అనేక సార్లు పంపించాడు. ఫలితంగా 700 మందిని రక్షించటానికి వీలైంది. వైర్ లెస్ టెలిగ్రాఫ్ విధానం ఇంకా వేళ్ళూనుకోక ముందే సంభాషణల్ని, సంగీతాన్ని ఇదే విధంగా ప్రసారం చేయగలిగే రోజు ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తుండేవారు. ఈ కలలు పంపడానికి అనేక సాంకేతిక అవరోధాలు అధిగమించవలసి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు