పి.ఎస్.ఆర్. అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పి.ఎస్.ఆర్.పోణంగి శ్రీరామ అప్పారావు''' నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత.
 
అప్పారావు 1923 జులై 21 వ తేదీన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[కొవ్వూరు]] తాలూకా, [[బరంపురం]]లో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, [[విజయవాడ]] శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.