వికీపీడియా:బయటి లింకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
=== వ్యాపార ప్రకటనలు, దృక్పథాల ఘర్షణ ===
వికీపీడియాకి ఉన్న ఆదరణను గమనించి దాన్ని సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడ దొడ్డిదారిన వ్యాపార ప్రకటనలు పెట్టుకుందామనే ఆలోచనలు చేసే అవకాశం ఉంది. '''మీది, మీరు మెయింటైను చేసేది, మీరు ప్రాతినిధ్యం వహించేది అయిన సైటుకు మీరు లింకు ఇవ్వకండి.''' వికీపీడియా మార్గదర్శకాల ప్రకారం ఆ సైటుకు లింకు ఇవ్వాల్సినంత అవసరం ఉన్నా సరే! ఆ లింకు అంత అవసరమైనదైతే ఆ విషయాన్ని వ్యాసపు చర్చాపేజీలో పెట్టి, తటస్థ సభ్యులను దాని సంగతిని తేల్చనివ్వండి.
 
వికీపీడియా బయటి లింకులు ఇచ్చే సమీక్షణలో వ్యాపార దృష్టితో ప్రారంభమైన వెబ్‌సైట్లను, ఉద్దాత్త భావనతో లేదా ప్రజోపయోగ దృష్టితో ప్రారంభమైన వెబ్‌సైట్లను సమదృష్టితోనే చూస్తుంది మరియు ప్రమాణాలను ఒకేలా వర్తింపజేస్తుంది. వికీపీడియా నుండి లింకు ఇవ్వటం వలన ఆ బయటి సైటు ప్రకటనలు, అమ్మకాలు మరియు డొనేషన్ల (స్వచ్ఛంద సంస్థల విషయంలో) ద్వారా ఆర్ధికంగా లాభం పొందే అవకాశం ఉన్నా కూడా అలాంటి సైట్లకు లింకులు ఇవ్వటాన్ని నిరోధించదు. లింకు ఇచ్చిన వెబ్‌సైటు సంస్థ యొక్క టాక్సు స్టేటసు లేదా ఆ లింకు వళ్ల వెబ్‌సైటు యజమానికి లాభం చేకూరుతుందేమోనన్న భావనతో కాకుండా, లింకును నొక్కిన వికీపీడియా పాఠకునికి వెంటనే ఒనగూడే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని బయటి లింకులను ఎంచుకోవాలి.
 
బాటు ద్వారా వ్యాసాల్లో బయటి లింకులను చొప్పించే స్పాము పద్ధతులు ఉన్నాయి. అలాంటి బాటు చర్యలను మీరు గమనిస్తే, ఇతర వికీల్లో కూడా అది జరుగుతుందేమో గమనించండి. అలా అయితే [[m:main page|మెటా-వికీ]] లోని నిర్వాహకుణ్ణి సంప్రదించండి; వాళ్ళు వికీ వ్యాప్త హెచ్చరికలను విడుదల చేస్తారు. నిర్వాహకులు అలాంటి బాట్లను నిషేధిస్తారు.