వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
* <big><big>[[వాడుకరి:Veeven|వీరవెంకట చౌదరి (వీవెన్)]]</big></big>: నిజామాబాద్ వర్ని గ్రామానికి చెందిన వీవెన్ ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివసిస్తున్నారు. వీరి అసలు పేరు వీరవెంకట చౌదరి. వృత్తిరీత్యా బిజెనెస్ అనలిస్ట్ అయిన వీరు వెబ్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో హెచ్.టి.ఎం.ఎల్. నేర్చుకున్నారు. వీరు పద్మా లిప్యంతరీకరణ ఉపకరణం పరిజ్ఞానం సాయంతో లేఖిని అనే లిప్యంతరీకరణ ఉపకరణాన్ని రూపు దిద్దారు. తెలుగు వికీపీడియాలో యూనికోడ్ అభివృద్ధి అయ్యే వరకు తెలుగు వికీపీడియాలో తెలుగులో రాయడానికి అనేకమంది సభ్యులకు ఈ లేఖినే ఆధారమయ్యింది. అలాగే - బ్లాగులలో యూనికోడ్ అభివృద్ధి చెందే వరకు తెలుగు బ్లాగులు రాసేవారికి కూడా బాగా ఉపకరించింది. 2006 లో వీరి ప్రవేశంతో తెలుగు వికీపీడియా కొత్త అందాలను సంతరించుకుంది. 2011లో వ్యాసేతర మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం అందుకున్న వీవెన్ తెవికీలో "నరయం " ప్రవేశపెట్టడం, మొబైల్ పేజీ రూపం తయారుచేయటం మొదలైన వాటికి నాయకత్వం వహించారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
 
* <big><big>[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]]</big></big> : అహమ్మద్ నిస్సార్నిసార్, విద్యావేత్త, చిత్తూరు జిల్లా మదనపల్లె కు చెందిన వారు. ప్రస్తుతం పుణెలో వున్నారు. ఇస్లాం, హిందూ, ఉర్దూ, విద్య, ఖగోళ, భౌతిక, వ్యక్తులు, భాషలు, దేశాలు, మతాలు, భూగోళ, తత్వ, సౌరశాస్త్ర, కళలు మరియు ఇతర వ్యాసాలు అనేకంగా రాసారు. వీరు తెలుగు వికీపీడియా అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన నిస్సార్ తన విస్తృత సేవలకుగాను దేవా, రవిచంద్రల నుంచి ప్రశంశా పతకాలను అందుకున్నారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు.
 
* <big><big>[[వాడుకరి:Mpradeep|మాకినేని ప్రదీప్]]</big></big>: 2005 లో వికీ ప్రవేశం చేసిన మాకినేని ప్రదీప్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తెలుగునేలపై పుట్టి, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ తెలుగు వికీపీడియాకు ''బాటు'' అందించడం ద్వారా సాంకేతికంగా చెప్పుకోదగిన సేవ చేశారు. విక్షనరీలో వీరు ''బాటు''ద్వారా చేసిన సేవకు వైజాసత్య నుండి మంత్రదండం గుర్తింపు పతకం అందుకున్నారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి, నిర్వాహకులు.