రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న చిన్న దిద్దుబాట్లు
పంక్తి 7:
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన [[గరికపాటి రాజారావు]]గారు ([[పుట్టిల్ల్లు]] సినిమా దర్శకులు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచారు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నారు. పూట గడవడానికి హాస్యనటుడు [[అడ్డాల నారాయణరావు]] పిల్లలకు ప్రైవేటు చెప్పేవారు. కొన్నాళ్ళ తరువాత [[అడ్డాల నారాయణరావు]]గారే రాజబాబుకి [[సమాజం]] సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తరువాత "తండ్రులు-కొడుకులు","కులగోత్రాలు","స్వర్ణగౌరి","మంచి మనిషి" మొదలగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు. మొదటి సినిమా విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న సినిమా పాత్రలలో నటిస్తూనే "కుక్కపిల్ల దొరికిందా", "నాలుగిళ్ళ చావిడి", "అల్లూరి సీతారామరాజు" మొదలగు నాటకాలు వేశారు.
===పేరు తెచ్చిన సినిమాలు===
జగపతి ఫిలింస్ వీ.బీ.రాజేంద్రప్రసాద్ సినిమా "[[అంతస్తులు]]" చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందారు. తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు సినర్మించిన ఎన్నో ప్రముఖ సినిమాలలో నటించారు. ఆ సమయంలో [[ఆకాశరామన్న]], [[సతీ శబరి]], [[ప్రచండ భైరవి]], [[సత్యహరిశ్చంద్ర]], [[సంగీత లక్ష్మి]], [[పరమానందయ్య శిష్యుల కథ]], [[ఉమ్మడి కుటుంబం]], [[విచిత్ర కుటుంబం]] లాంటి చిత్రాలలో నటించారు. రాజబాబుకు జంటగా [[లీలా రాణి]], [[మీనా కుమారి]], [[ప్రసన్న రాణి]], [[గీతాంజలి]] లాంటి వారు నటించినా, ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం [[రమాప్రభ]] గారే. [[ఇద్దరు అమ్మాయిలు]], [[ప్రేమ్ నగర్]], [[ఇల్లు ఇల్లాలు]], [[పల్లెటూరి బావ]], [[సెక్రెటరి]], [[జీవన జ్యోతి]], [[కార్తీక దీపం]], [[అడవి రాముడు]], [[సోగ్గాడు]] లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడికి మంచి హాస్య జంటగా ప్రేరు తెచ్చాయి.
 
===ఇతర పాత్రలు===
రాజబాబు [[తాతా మనవడు]], [[పిచ్చోడి పెళ్ళి]], [[తిరుపతి]], [[ఎవరికి వారే యమునా తీరే]], [[మనిషి రోడ్డున పడ్డాడు]] లాంటి సినిమాలలో హీరోగా నటించారు. ఈ సినిమాలలో [[ఎవరికి వారే యమునా తీరే]], [[మనిషి రోడ్డున పడ్డాడు]] సినిమాలను స్వయంగా [[బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్]] అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/రాజబాబు" నుండి వెలికితీశారు