ఎస్‌.ఆర్‌.శంకరన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరణ
+{{వికీకరణ}}
పంక్తి 1:
{{వికీకరణ}}
తమిళనాడులోని తంజావూరు జిల్లా సిరిగలత్తూరు గ్రామంలో జన్మించిన ఎస్‌.ఆర్‌.శంకరన్‌ 1957 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. నెల్లూరు జిల్లా కలెక్టరుగా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేసిన ఆయన 1992లో పదవీ విరమణ చేశారు.పెళ్లి చేసుకుంటే పేదల కోసం పూర్తిగా పని చేయాలన్న ఆలోచనకు ఆటంకం కలుగుతుందని [[బ్రహ్మచారి]] గానే ఉండిపోయారు.మన రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మూడేళ్లపాటు పనిచేశారు.ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రతిపాదించినా శంకరన్‌ తిరస్కరించారు. 1987లో నక్సల్స్‌ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ మావోయిస్టు పార్టీ (అప్పట్లో పీపుల్స్‌వార్‌) శంకరన్‌ను తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్‌ చేసింది.పేదలు, దళితుల తరఫున గట్టిగా వాదనను వినిపించేవారు. బొగ్గు గనులను జాతీయం చేయడంలోనూ, వెట్టి చాకిరీని నిర్మూలించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు.గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఆహార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో పోలీసు ఎన్‌కౌంటర్లు, నక్సల్‌ ప్రతి హింసల కారణంగా నెలకొన్న పరిస్థితులతో కలత చెందిన ఆయన శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు కృషి చేశారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన శాంతి చర్చల్లో ప్రధాన భూమిక పోషించారు.దేశవ్యాప్తంగా ఐటీడీఏల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన కాలంలోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించారు.ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లకు వూపిరి పోశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఎస్సీ ఉప ప్రణాళిక (ఎస్‌సీఎస్‌పీ), గిరిజన ఉప ప్రణాళికలకు (టీఎస్‌పీ) రూపకల్పన చేశారు.7.10.2010 న హైదరాబాదులో చనిపోయారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎస్‌.ఆర్‌.శంకరన్" నుండి వెలికితీశారు