తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==వ్రేళ్ళను ఎంచుట==
చిటికెన వ్రేలితో మొదలుపెట్టి బొటన వ్రేలి వైపు ఒక్కొక్క వ్రేలుగా ఎంచవలెను. ఆరు ఏడు తొమ్మిది మొదలగు ఐదు కంటే ఎక్కువ వ్రేళ్ళు ఎంచవలసినపుడు మరల చిటికెన వ్రేలుతో ప్రారంభించి బొటన వ్రేలి వైపు ఎంచవలెను.
 
లఘువు యొక్క అక్షర విలువ, ఆయా లఘువు యొక్క జాతులపై ఆధారపడును. లఘువు అను అంగమునకు ఐదు జాతులున్నవి. హిందూ అన్న పదములో బ్రహ్మ,క్షత్రియ,వైశ్య,శూద్ర అను ఎట్లు నాలుగు జాతులున్నవో అట్లే లఘువునలు త్రిశ్ర,చతురశ్ర,ఖండ,మిశ్ర,సంకీర్ణ అను ఐదు జాతులున్నవి. కనుక పై జాతులు కల లఘువులు త్రిశ్ర లఘువు, చరురశ్ర లఘువు, ఖండ లఘువు, మిశ్రలఘువు, సంకీర్ణ లఘువు అని పిలువబడుచున్నవి. త్రిశ్ర అనగా మూడు కనుక త్రిశ్ర లఘువు అనగా ఆ లఘువునకు 3 అక్షరముల విలువయని అర్థము. ఈ ఐదు జాయుల లఘువులను సంకేతము వ్రాయునపుడు.
* త్రిశ్ర లఘువు I<sub>3</sub> గాను
* చతురశ్ర లఘువు I<sub>4</sub> గాను
* ఖండ లఘువు I<sub>5</sub> గాను
* మిశ్ర లఘువు I<sub>7</sub> గాను
* సంకీర్ణ లఘువు I<sub>9</sub> గాను
వాటి వాటి అక్షర కాల విలువ లఘువు సంకేతమైన చిన్న నిలువు గీత భాగమున చిన్న అంకెలుగా వ్రాయవలెను.
 
 
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు