వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Bharatam lo.JPG|thumb|left|మహాభారత నాటకాల సందర్బంగా పగటి పూట జరిగే ధుర్యోధన వధ నాటకాని తీర్చి దిద్దిన ధుర్యోధన మట్టి విగ్రహం. దామల చెరువు గ్రామంలో తీసిన చిత్రము]]
 
గతంలో...... పల్లెల్లో ప్రజలు వినోదార్తం వీది నాటకాలు వేసే వారు. ముఖ్యంగా భారతం లో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీది నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. నాటకం లోని స్త్రీ పాతలను కూడ మగ వారె వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని [[ఒద్దిక]] (రెహార్సిల్) అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, బజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడ ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒక వేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు. వారి వేషధారణకు కావలసిన ఆభరణాలు, ఆయుదాలు, బట్టలు, తెరలు వంటి వస్తువులను అద్దెకిచ్చె కొన్ని అంగళ్ళూ చిన్న పట్టణాలలో ఉండేవి.రాను రాను పల్లెవాసులు ముఖాలకు రంగులేసుకునే కాలం పోయింది. ఆ నాటకాలలో పద్యాలు పాడడానికే ఎక్కువ ప్రాముక్యత వుండేది. ఒక పద్యానికి సుమారు పది నిముషాలు సమయం రాగం తీసేవారు. దాన్ని ప్రజలు కూడ మెచ్చుకునేవారు. ఇలాంటి నాటకాలు రాత్రులలో సుమారు పది గంటలకు మొదలై తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ముగిసేయి. అంత సేపూ ప్రజలు ఓపిగ్గా కూర్చుని చూసేవారు.
 
ఒక వేషధారి వేదికమీదికి రాగానే.... తన పాత్ర పేరు చెప్పుకుంటూ పాట పాడుతూ ఆ వేధికపై గుండ్రంగా తిరుగు తాడు. ఉదాహరణకు దుర్యోధనుని పాత్ర ధారి వేధికమీదికి తన సహోధరులతో వేధిక మీదికి రాగానే '' రాజు వెడలె రవి తేజములలరగ.... కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ..... అని పాడుతూ వస్తాడు. దాంతో ఆ వచ్చినది దుర్యోధనుడని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ తర్వాత అతను ''ధుర్వోధన.....'' అంటూ చేతులు వూపుతూ తిరుగుతుంటే వెంట నున్న సోదరులు..'' రాజే... రాజే.... రాజే... '' అంటూ సుమారు పది నిముషాలు తిరుగుతారు. ఆతర్వాత దుర్వోధనుడు సింహాసనం పై ఆసీనుడై.. పాట రూపంలో..... ''సుఖమా మన రాజ్యామెల్లను జయమా.. '' అంటూ రాగాలు తీస్తూ పాడితే... దానికి వంతగా మిగతావారు సామూహికంగా వంత పాడతారు. ఈ వంత పాటలను వేధిక మీద వున్న వేష ధారులే కాక.... తెర వెనుక వున్న ఇతర వేష ధారులు కూడ కలిసి పాడుతారు. అసలు కథకన్నా ఇటువంటి వాటికే ఎక్కువ సమయం అయి పోతుంది. భీముడు- దుర్వోధను వాగ్వివాదము జరిగే సందర్బంలో..... వారి సంభాషణ చాల మొరటుగాను, అపహాస్యంగాను, వ్వక్తిగత నిందారోపణలు చేసుకున్నట్టు వుంటుంది. భాష కూడ అదే తీరులో వుంటుండి. పల్లెల్లో నిజంగా ఏదైన కొట్లాట జరిగితే ఆసందర్బంలో జరిగే మాటల లాంటివె... ఆ భాషనే సమయా సందర్బంగా వాడుతారు. కాని ప్రేక్షకులు దానిని కూడ స్వాగతిస్తారు. ఈ మద్యలో ఏదేని మంచి పద్యం పొడుగ్గా రాగం తీస్తే.... దాన్ని మళ్ళీ పాడమని ''ఒన్ సు మోర్ '' అని అరుస్తారు. విధిగా ఆ పద్యాన్ని తిరిగి వారు పాడేవారు.
 
పల్లె ప్రజలే నాటకాలను నేర్చి ఆడే కాలం పోయి..... వృత్తి రీత్యా నాటకాలాడే వారిని పిలిపించి పల్లెల్లో నాటకాలాడించే వారు.
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు