గీతం (పాట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==గీత రచయితలు==
గీతములను రచించుట, గీతములు పాడుట ఒకప్పుడు చాల గొప్ప విద్వత్తుగా నెంచబడుచుండెను. పైడాల గురుమూర్తి శాస్త్రి అను వాగ్గేయకారులు 1000 గీతములు రచించినందున వెయ్యి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి అను బిరుదును పొందెను. గీవింద దీక్షితులు, వెంకటముఖి, గోవిందాచార్యులు, రామామాత్యుడు,పురందరదాసు మున్నగు వారు గీతముల రచించిన మహాశయులు
 
పురందరదాసుల వారు ప్రారంభములో నేర్చుకొను పిళ్ళారీ గీతములు రచించినారు. ఈ గీతములు విఘ్నేశ్వరునీ, మహేశ్వరునీ, విష్ణువును కొలుచు గీతములు. ఘన రాగ గీతములు అను నాట, గౌళ,ఆరభి, శ్రీ, వరాళి అను రాగములలో గీతములు రచింపబడినవి.
 
రాగమాల గీతమని కొన్ని రాగములలో రాగమాలికను పోలిన ఒక గీతమున్నది. ప్రబంధముల వలె రచింపబడిన గీతము గీత ప్రబంధము. గీత ప్రకరణములో లక్షణ గీతములు కూడా వ్రాయబడినవి.
"https://te.wikipedia.org/wiki/గీతం_(పాట)" నుండి వెలికితీశారు