వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
పల్లె వాసులు ముఖాలకు రంగులేసుకుని వీధుల్లో నాటకాలాడే రోజులలోనే..... ప్రధానమైన పల్లెల్లో అక్కడక్కడా పాండవుల ఆలయాలుండేవి. అక్కడ ప్రతి సంవత్సరం [[మహాభారతం]] పేరుతో... అందులోని 18 ఘట్టాలను 18 రోజుల పాటు రాత్రులందు ఆడేవారు. పగటి పూట ఆ రోజు రాతికి ఆడబోయే ఘట్టాన్ని పరికథ రూపంలో చెప్పేవారు. పగలు కూడ ప్రజలు బాగా వచ్చేవారు. రాత్రి నాటకాలకైతే చుట్టు ప్రక్కల పల్లె ప్రజలు ఎద్దుల బండ్లమీద వచ్చేవారు. [[భారతం]] జరిగే ఈ ప్రాంతం అంతా చాల కోలాహలంగా వుండేది. అదొక తిరుణాల లాగ వుండేది. చిన్న షాపులు, కాఫీ., టీ అంగళ్ళూ, పిల్లల బొమ్మలు అమ్మేవారు, రంగుల రాట్నం, కీలుగుర్రం, తోలుబొమ్మలాటలు, దొమ్మరాటలు, చక్రాలాట, చింత పిక్కలాటలు ఇలా అనేక హంగులతో ఆ ప్రాంతమంతా ఆ పద్దెనిమిది రోజులు చాల కోలాహలంగా వుండేది. కాలానుగుణంగా తర్వాతి కాలంలో విద్యుత్తు వచ్చినందున విద్యుత్తు దీపాలంకరణ కూడ వుండేది. దాంతో ఆ ప్రాంతమంతా చాల చాల వుత్సాహంగా కనబడేది. ఈ నాటకాలాడడానికి వృత్తి రీత్యా ఆడేవారినే ధనమిచ్చి రప్పించేవారు. వారితో బాటు పల్లెల్లోని ఔత్చాహికులు వేషాలు వేయడానికి చాల ఆరాట పడే వారు. ముఖానికి రంగు లేసుకోవాలంటే వారికెంత ఇష్టమో చెప్పలేము. అవిదంగా చిన్న చిన్న వేషాలు పల్లె వాసులు కూడ వేసే వారు. ప్రేక్షకులు కూడ వారిని ఆవిధంగానె ఆదరించే వారు. ఆ విధంగా మహా భారత నాటకాలు పద్దెనిమిది రోజుల పాటు జరిగేవి. ఇన్ని రోజుల పాటు నటీనటులు గాని, నాటక సమాజం గానీ ఎంతో నిష్టగా , ఒక యజ్ఞం లాగ పూర్తి చేసే వారు. చివరగా .... కొసరుగా మహాభారతానికి సంబందంలేని ఒక్క నాటకాన్ని చివరి రోజున ఆడేవారు. దాంతో ఈ మహా యజ్ఞం పూర్తయ్యేది.
 
==మహాభారతంలో 3 ప్రధాన ఘట్టాలు===
 
ఎక్కువగా [[మహాభారతం]] లోని ఘట్టాలను, వీధి నాటకాలుగా వేసేవారు. వీరు కాకుండా నాటకాలు వేయడమే వృత్తి గా వున్న బృందాలు అక్కడక్కడా వుండేవి. వారిని పిలిపించి తమకు కావలసిన నాటకాన్నీ వేయించి ఆనందించేవారు. ప్రస్తుత కాలంలో ఈ వీధినాటకాలు చాల వరకు కనుమరుగైనాయి. పల్లెవాసులు ఇప్పుడు మొఖాలకు రంగులేసుకోవడం లేదు. కాని వృత్తిగా నాటకాలేసే వారిని పిలిపించి [[మహాభారత]] ఘట్టాల నాటకాలు సుమారు ఇరవై రోజుల పాటు ఆడిస్తున్నారు. ఇందుకొరకు కొన్ని గ్రామాలకు కలిపి అక్కడ పంచపాండవుల విగ్రహాలున్న ఆలయాలున్నవి. అక్కడ ఈ భారతం జరుగుతుంది. ఇది ఒక పెద్ద జాతర లాగ రాత్రి పగలు కూడ జరుగుతుంది. పగలంతా మహాభారత ఘట్టాలను హరికథ రూపంలో కథ చెప్పితే అదే ఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. అదీ కేవలం చిత్తూరు జిల్లాలో ఈ నాటకాలు వేస్తున్నారు. అది కూడా పేరు మోసిన నాటక కంపెని వారి చేత వేయిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం మొఖానికి రంగు లేసుకోవడం లేదు.
 
బక్కాసుర వధ నాడు., భీముని వేష దారి, అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలొ వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి ''భారతం మిట్ట'' కు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పధార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పధార్థాలను అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్సిత మౌతుంది. ఈ [[మహాభారత నాటకాలు]] ఈ రోజుల్లోను జరుగుతున్నాయి.
 
[[దస్త్రం:Top of penance tree.JPG|thumb|right|అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం]]
ఎక్కువగా [[మహాభారతం]] లోని ఘట్టాలను, వీధి నాటకాలుగా వేసేవారు. వీరు కాకుండా నాటకాలు వేయడమే వృత్తి గా వున్న బృందాలు అక్కడక్కడా వుండేవి. వారిని పిలిపించి తమకు కావలసిన నాటకాన్నీ వేయించి ఆనందించేవారు. ప్రస్తుత కాలంలో ఈ వీధినాటకాలు చాల వరకు కనుమరుగైనాయి. పల్లెవాసులు ఇప్పుడు మొఖాలకు రంగులేసుకోవడం లేదు. కాని వృత్తిగా నాటకాలేసే వారిని పిలిపించి [[మహాభారత]] ఘట్టాల నాటకాలు సుమారు ఇరవై రోజుల పాటు ఆడిస్తున్నారు. ఇందుకొరకు కొన్ని గ్రామాలకు కలిపి అక్కడ పంచపాండవుల విగ్రహాలున్న ఆలయాలున్నవి. అక్కడ ఈ భారతం జరుగుతుంది. ఇది ఒక పెద్ద జాతర లాగ రాత్రి పగలు కూడ జరుగుతుంది. పగలంతా మహాభారత ఘట్టాలను హరికథ రూపంలో కథ చెప్పితే అదే ఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. అదీ కేవలం చిత్తూరు జిల్లాలో ఈ నాటకాలు వేస్తున్నారు. అది కూడా పేరు మోసిన నాటక కంపెని వారి చేత వేయిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం మొఖానికి రంగు లేసుకోవడం లేదు.
;[[ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట]]; ఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి బాగ అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాం ప్రమాణ ముద్రలో [['వరానికి' ]]వడి వుంటారు. వారు దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడ వుంటారు. వారు కూడ అర్జునుడు విసిరే [[ప్రసాదం]] కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేధిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడ ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్య క్రమం సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది
 
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు