"వీధి నాటకం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  7 సంవత్సరాల క్రితం
చి
పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ''ధుర్యోధన వధ:'' దీనికొరకు మైదాన మధ్యలో మట్టితో ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్న అతి బారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారు. ధుర్యోధన పాత్ర దారి గధను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడు. భీమ వేష దారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడు. భీముడు..... ధుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడు అప్పు డప్పుడు క్రిందికి దిగు తాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపు యుద్దం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టా నికొస్తారు. అప్పుడు భీమ వేష దారి ధుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారి అ విగ్రహంపై పడి పోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తం తో తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తె తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగె ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే తమ పంటలు సంవృద్దిగా పండ తాయని ప్రజల నమ్మకం.
==యివికూడా చూడండి==
* [[పల్లెవాసుల జీవన విధానంజీవనవిధానం]]
* [[పల్లెల్లో వినోద కార్యక్రమాలు]]
 
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/857540" నుండి వెలికితీశారు