రాగమాలిక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{భారతీయ సంగీతం}} మాలిక అనగా మాల లేదా హారము అని అర్థము. హారము రం...
 
పంక్తి 2:
మాలిక అనగా మాల లేదా హారము అని అర్థము. హారము రంగు రంగుల పుష్పములచే అందముగా కట్టబడి యుండును. చూచుటకు కన్నులకు సొంపుగా నుండును.అదే రీతిన రాగమాలిక కూడా రాగముల యొక్క హారము. ఒక్కొక్క అంగము (పల్లవి, అనుపల్లవి మొదలగునవి) ఒక్కొక్క రాగములో రచించబడి రచన యొక్క నడకను గానీ భావమును గాని చెడపక, సౌందర్యమును పెంపొందించునట్లు రచింపబడిన రచన '''రాగమాలిక'''
==లక్షణము==
రాగమాలిక అనునది ప్రత్యేక సంగీత రచన. [[తాళము]] మారక రాగము మాత్రము అంగ అంగమునకు మారుచుందు రచన రాగమాలిక. పల్లవి, అనుపల్లవి, కొన్ని చరణములుండును. నాలుగు రాగముల కంటె తక్కువ రాగములతో రాగమాలిక ఉండుట అరుదు. అనగా కనిష్టము రాగమాలికకు నాలుగు రాగములుండవలెను. కొన్ని రాగ మాలికలలో అనుపల్లవి లేకుండుటయు కలదు. ఒక్కొక్క రాగము తరువాత ఆ రాగ చిట్టస్వరమును, తరువాత పల్లవిని అందుకొనుటకు వీలుగా నుండుట కొరకు పల్లవి రాగములోని చిట్టస్వారములోని కొంత భాగము నుండుట కలదు.కాబట్టి ప్రతి రాగమును పాడిన తరువాత ఈ వంతెన చిట్టస్వరము వల్ల పల్లవిని అందుకొని పాడుట సులువగుచున్నది. కొన్ని రాగమాలికలలో చిట్టస్వరము లేకుండా యుండును. ఒక్కొక్క రాగము యొక్క పేరు సాహిత్యములోని పదములతో అర్థము చెడకుండా కూర్చి వారి నైపుణ్యమును చూపు రాగమాలికా రచయితలు కొందరు కలరు. కళ్యాణి రాగమయినపుడు "నిత్యాకళ్యాణీ నిగమాగమ సంచారిణీ" అని అర్థము చెడకుండా పొంకముగా నున్నది. కొన్ని రాగమాలికలలో రాగ నామములు సహిత్యములో లేక యుండుట కలదు. ఒక రాగము నుండి ఇంకొక రాగమునకు మారుట వల్ల రసములు మారినను, మార్పు చాల సునిశితముగా నుండునటుల రచయిత రచించును. ఒక్క రాగము నుండి ఇంకొక రాగమునకు మారునపుడు ఆ మార్పు మన చెవులకు ఎంతో క్రొత్త ఆనందమునిచ్చును. పెద్ద పెద్ద రాగమాలికలు కొన్ని భాగములుగా భాగింపబడి ఒక్కొక్క భాగము స్వతంత్రముగా ఉంచబడుచున్నవి. సాహిత్యము దైవ ప్రార్థనగాను రాజపోషకుని స్తోత్రముగాను లేక శృంగారముగాను ఉండవచ్చును.
==కొన్ని రాగమాలికలు==
"https://te.wikipedia.org/wiki/రాగమాలిక" నుండి వెలికితీశారు