తెలుగు సినిమాలు 1950: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
తెలుగు సినిమాలు 1950
పంక్తి 1:
ఈ యేడాది అత్యధికంగా 17 చిత్రాలు విడుద లయ్యాయి. వాటిలో నందమూరి, అక్కినేని తొలిసారి కలసి నటించిన బి.ఎ.సుబ్బారావు తొలి చిత్రం 'పల్లెటూరి పిల్ల', ఆ ఇద్దరితోనేయల్‌.వి.ప్రసాద్‌ రూపొందించిన 'సంసారం' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. జెమినీ వారి 'అపూర్వ సోదరులు', ఏవీయమ్‌ వారి 'జీవితం' హిట్స్‌గా నిలిచాయి. చాలా కాలం తరువాత పోటీ చిత్రాలుగా విడుదలైన ప్రతిభావారి 'శ్రీలక్ష్మమ్మ కథ' పరాజయం చవిచూడగా, శోభనాచల వారి 'లక్ష్మమ్మ' ఆర్థికంగా ముందంజ వేసింది. నాగిరెడ్డి, చక్రపాణి 'విజయా సంస్థ'ను స్థాపించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన 'షావుకారు' చిత్రం సహజత్వానికి పెద్ద పీట వేసి, సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిచ్చి తెలుగు సినిమా పోకడను మార్చివేసింది. ఈ చిత్రం ద్వారా జానకి, 'జీవితం' ద్వారా వైజయంతిమాల పరిచయమయ్యారు. సినిమా చరిత్రకారులు ఈ యేడాది నుండే తెలుగు సినిమా 'స్వర్ణయుగం' ఆరంభమైందని పేర్కొంటారు. యావత్‌ ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఐదో దశకం 'స్వర్ణయుగం'గా భాసిల్లింది.
 
#[[అదృష్టదీపుడు]]
#[[అపూర్వ సహోదరులు (1950 సినిమా)|అపూర్వ సహోదరులు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1950" నుండి వెలికితీశారు