"మానస సరోవరం" కూర్పుల మధ్య తేడాలు

3,195 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q233627 (translate me))
[[దస్త్రం:Mansarovar.jpg|thumb|right|250px|సరస్సు మరియు టిబెటన్ హిమాలయాలు.]]
 
మానసరోవరం (లేక మానస సరోవరము, లేక మానస్) అనేది [[చైనా]] (China) కు చెందిన [[టిబెట్]] (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, నేపాల్ కు చేరువలో ఉన్నది. చైనా లో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు.
'''మానస సరోవరం''' : [[టిబెట్]] లోని స్వచ్చమైన నీటి [[సరస్సు]]. [[లాసా]] నుంచి 2000 కి.మీ దూరంలో ఉంటుంది. దీనికి పడమటి వైపు [[రక్షస్తలి సరస్సు]], ఉత్తరం వైపు [[కైలాస శిఖరము]] ఉన్నాయి.
 
== భౌగోళిక స్వరూపం ==
మానసరోవరానికి పశ్చిమాన [[రాక్షస్తల్]] అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే [[కైలాస పర్వతం]] ఉన్నవి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉన్నది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న మానసరోవరం గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధామైయున్నది. . ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగష్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer)లో గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter)లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా కొండలు, బండ రాళ్ళు, అక్కడక్కడా చిన్నపాటి గడ్డి జాతి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి.
మానస సరోవరము సముద్ర మట్టం నుంచి 4556 మీ ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన స్వచ్చమైన నీటి సరస్సు. దాదాపుగా గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధి 88 కి.మీ., లోతు 90 మీ, వైశాల్యం 320 చ.కి.మీ. ఈ సరస్సులో నీళ్ళన్నీ చలికాలంలో గడ్డకట్టుకొని పోతాయి. మరల వసంత కాలంలోనే తిరిగి నీరుగా మారుతాయి.
 
== సాంస్కృతిక ప్రాధాన్యం ==
సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో [[భారత దేశం]], టిబెట్, [[నేపాల్]] సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం [[బ్రహ్మ]] దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన [[హంస]]లు (Swans) మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.
కైలాసగిరి పర్వత శిఖరం లాగే మానస సరోవరం కూడా ఒక మంచి యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. భారతీయ ధార్మిక సాంప్రదాయం ప్రకారం పవిత్రమైనది కావున ఎంతో మంది ఆధ్యాత్మిక భారతీయ యాత్రికులు దీనిని సందర్శిస్తుంటారు. ఈ సరస్సులో స్నానం చేసినా, ఆ నీటిని పానం చేసినా అది తమ పాపాలను పటాపంచలు చేస్తుందని యాత్రీకుల విశ్వాసం.
 
==యాత్రలు==
చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో ఖట్మండు నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.
 
[[వర్గం: హిందూ మతము]]
 
[[వర్గం:సరస్సులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/858767" నుండి వెలికితీశారు