వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{Infobox person
| name = '''వడ్డాది పాపయ్య'''
Line 14 ⟶ 13:
| signature = "వ.పా" లేక "0|0"
}}
 
 
భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు '''వడ్డాది పాపయ్య'''. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
 
పవిత్ర [[నాగావళీ]] నదీ తీరాన [[శ్రీకాకుళం]] పట్టణంలో రామమూర్తి, మహలక్ష్మి దంపతులకు ([[సెప్టెంబరు 10]], [[1921]] - [[డిసెంబరు 30]], [[1992]]) ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించాడు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న [[రవివర్మ]] చిత్రం "కోదండ రామ" ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్య ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప,చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నాడు.
==జీవిత విశేషాలు==
అతి సామాన్యమైన రంగుల్లోంచి అత్యద్భుతమైన బొమ్మలను , ఇంద్రధనుస్సులో కూడా కానరాని రంగుల కలయికనూ చూపగలిగిన వడ్డాది పాపయ్య కళాజీవితం ఎంతటి ఉన్నతమో, వ్యక్తిగత జీవితం అంతకంటే గొప్పది. పల్లె పడతుల అంద చందాలను, స్నిగ్ద మనోహర వలపు తలపులను చిత్ర కళాకారులు ఏనాటి నుంచో చిత్రీకరించినా వ.పా శైలి మాత్రం అజరామరంగా నిలిచి పోతుంది. మత్స్య గ్రంధి, ఊర్మిలనిద్ర, పంచతంత్రం కథలలోని జంతు ప్రపంచం ఈయన కుంచె కదలికలతో జనజీవాలు నింపుకొని కళాభిరుచి గూర్చి తెలియని పాఠకుల్ని సైతం కళాభిమానులుగా తీర్చిదిద్దాయి. తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మలలోని సంతకానికి అందినంత గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మరెవరికీ అందలేదనే చెప్పాలి. అయితె ఈయన ప్రతిభ యావత్తూ పరిమిత వర్గంలోనే అవగాహనకు అందింది. చరమ దశలో ఒక పత్రిక యాజమాన్యం ఈయన చిత్ర కళను గుత్తకు తీసుకొని వాణిజ్య పరంగా రాణించింది.
 
గీతకు అర్థం
 
==పత్రికా రంగంలో==
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు