"పరశురాముడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{శ్రవణ తెవికీ|ParasuraamuDu.ogg‎|2007-06-07|పరశురాముడు}}
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు [[గాధి]]. ఒకసారి భృగు వంశానికి చెందిన [[ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానికిస్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. [[గాధి]] కొడుకే [[విశ్వామిత్రుడు]].
భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర [[గొడ్డలి]]) పొంది, పరశురాముడైనాడు.
 
*స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు [[పరశురామ జయంతి]] జరుపుకుంటారు.
 
* పరశురాముడు [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు [[స్కాంద పురాణం]] లొలో వివరించబడింది.
 
* ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద [[వినాయకుడు]] అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.
* పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.
 
* భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమి లొభూమిలో గల 7 ప్రదేశాలను [[పరశురామక్షేత్రాలు]] అని అంటారు.
 
* [[కేరళ]]లో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.
31,603

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/859353" నుండి వెలికితీశారు