"ఆంధ్ర నాటక కళా పరిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+{{వికీకరణ}})
కొప్పరపు సుబ్బారావు లిటిల్ థియేటర్స్, గరికపాటి రాజారావు ప్రజానాట్యమండలి, కె.వి. గోపాలస్వామి నాయుడు విద్యార్థి నాటకరంగం, హైద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం వంటి సంస్థలకే కాక ఈనాడు కొత్తగా ఆవిర్భవిస్తున్న సంస్థలన్నింటికి మార్గదర్శక సంస్థ ఆంధ్ర నాటక కళాపరిషత్తు.
చలన చిత్ర రంగంలో ప్రముఖులైన ఎందరో కళాకారులు, రచయితలు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు పరిషత్తుతో సంబంధంబఉండి, పరిషత్తు ప్రోత్సాహంతో పైకి వచ్చినవారే. ఉత్తమ ప్రమాణాలను నాటకరంగంలో నెలకొల్పి, అర్థ శతాబ్దం పైగా అత్యుత్తమ సేతలు అందించిన ఈ సంస్థను యధావిధిగా తన కార్య్రకమాలు కొనసాగేలా కాపాడుకోవలసిన బాధ్యత కళాభిమానులందరిపైనా ఉంది.
1929 లో నాటి ఉమ్మడి మదరాసు రాష్ట్రం లో రిజిష్టర్ చేయబడిన ఈ సంస్థను ఇటీవలి కాలం లో పునరుద్ధరించి బొల్లినేని కృష్ణయ్య గారు అధ్యక్షులుగా , అన్నమనేని ప్రసాద రావు గారు కార్యదర్శి గా వ్యవహరిస్తూ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు , వరంగల్లు , విశాఖపట్టణం , తిరుపతి పట్టణాల్లో ప్రాంతాల వారీగా రచయితలు , కవులు ,కళాకారుల సదస్సును నిర్వహించి నాటక రంగ అభ్యున్నతికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి లో 2013 జూన్ 9న రాష్ట్ర స్థాయి నాటక పరిషత్తుల సదస్సు నిర్వహించి వారు పోటీల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి విస్తృతంగా చర్చించారు.
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/859491" నుండి వెలికితీశారు