ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 17 interwiki links, now provided by Wikidata on d:q20134 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
మొక్కలోని [[ఆకు]]లను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను '''ఆకు కూరలు''' అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో మరియు వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.
 
దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులుగల మొక్కలు ఉన్నాయి అయితే ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితిగల బచ్చలి, తోటకూర వంటి చిన్న చిన్న మొక్కలుండేమొక్కల నుండే వస్తాయి. <!-- woody plants-->తినయోగ్యమైన ఆకులు ఉన్న వృక్షాకార మొక్కలకు [[ఆడంసోనియా]], [[అరేలియా]], [[మోరింగా]], [[మోరస్]], మరియు [[టూనా]] రకాలు కొన్ని ఉదాహరణలు.
 
అనేక పశుగ్రాస పంటల యొక్క ఆకులు కూడా మనుషులు తినడానికి యోగ్యమైనవే కానీ దుర్భర కరువు కాటక సమయాల్లోనే అంటువంటివిఅటువంటివి తింటారు. [[ఆల్ఫాఆల్ఫా]], [[లవంగము]], [[గోధుమ]], [[జొన్న]], [[మొక్కజొన్న]] మొదలుకొని అనేక గడ్డులు వీటికి ఉదాహరణలు. ఈ మొక్కలు సాంప్రదాయక ఆకుకూరల కంటే త్వరితగతిన పెరుగుతాయి అయితే పీచు శాతము ఎక్కువగా ఉండటము మూలాన వీటి నుండి మెండైన పోషక విలువలు రాబట్టడము చాలా కష్టము. ఈ అడ్డంకిని ఎండబెట్టడము, పొడి చేయడము, పిప్పి చేయడము, రసము పిండటము మొదలైన ప్రక్రియల ద్వారా అధిగమించవచ్చు.
 
== ఆకుకూరలతో కలిగే మేలు ==
* ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
* భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
* ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
* ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు