బెల్లంకొండ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నటుడు న్యాయవాది అయిన బెల్లంకొండ సుబ్బారావు గారు 1902లో కారంపూర...
(తేడా లేదు)

07:44, 13 జూన్ 2013 నాటి కూర్పు

నటుడు న్యాయవాది అయిన బెల్లంకొండ సుబ్బారావు గారు 1902లో కారంపూరిలో జన్మించారు.కాని పెరిగింది మాత్రం నరసరావుపేటలోనే. ఈయన మొదటి వేషం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు. పాండవోద్యోగ విజయాలు లో శ్రీకృష్ణ పాత్రధారణలో ఈయన నటన తారాస్థాయినందుకుంది. చక్కగా పద్యం విడమరిచి పాడడం, నాభి దగ్గరనుండి నాదాన్ని తీసుకురావడం, పద్యంలోని ముఖ్య పాదాన్ని తిరిగి తిరిగి చదవడం ఈయన ప్రత్యేకత. కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకున్నది ఈయనొక్కడే.అందుకనే ఈయనను మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చ పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి ఈయన మీసాలే కారణం. కృష్ణపాత్ర ఈయనకు అంకితమైపోయింది. శ్రీకృష్ణుడు, రాజరాజు, నలబాహుకులు, హరిశ్చంద్రుడు, విజయరామరాజు, పఠాన్ రుస్తుం పాత్రలలో నటించిన బెల్లంకొండ సుబ్బారావుగారు 1952, నవంబర్ 21న పరమపదించారు.