"బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[దస్త్రం:Burra Subrahmanyasastry.JPG|225px|ritht|thumb|బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి]]
బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు. గుంటూరు జిల్లా, తెనాలిలో 1908 అక్టోబర్ 10న జన్మించాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 35 </ref>.
 
 
 
శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. కవి సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు సృజనాత్మక రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ శిల్పం తో రాణింపు కలగచేస్తాడు. భావయుక్తమైన సంభాషణ విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేట్లు నటించేవాడు. చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితొ నిండిపోయేది. శాస్త్రి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాధ సత్యనారాయణ "నాట్యాచార్య" బిరుదునిచ్చాడు. ఆంధ్ర ప్రజానీకం "అభినయ సరస్వతి" అని, కొండవీటి వెంకటకవి "నాట్యమయూరి" అని బిరుదులిచ్చారు. అనేక చోట్ల ఘన సన్మానాలు, బంగారు కంకణాలనూ అందుకున్నాడు.
 
1937లో చలనచిత్ర రంగం లో ప్రవేశించి పోతన,స్వర్గసీమ,వేమన పెద్ద మనుషులు,త్యాగయ్య,నా యిల్లు,రామదాసు చిత్రాల్లో నటించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/860260" నుండి వెలికితీశారు