"వర్గం:తెలుగు రంగస్థల నటులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు రంగస్థలం తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
 
పారుపల్లి సుబ్బారావు : కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో జన్మించారు.స్ఫురద్రూపం , చక్కని గాత్ర మాధుర్యం. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ , పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు.స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.రసపుత్ర విజయం లో విమల, లవకుశ లో రాముడు ఇంకా సావిత్రి,లీలావతి పాత్రలను పోషించారు.
 
పులిపాటి వెంకటేశ్వర్లు : గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస్థలం పై ప్రవేశించి స్థానం నరసింహా రావు,బందా కనకలింగేశ్వర్ రావు,బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు,మైసూరు,మహారాష్ట్ర,బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.నాటకాలలో అర్జునుడు,నక్షత్రకుడు,భవానీ శంకరుడు,సుబుద్ధి,చెకుముకి శాస్త్రి,వెంగళరాయడు,భరతుడు,నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు,హరిశ్చంద్ర లో నక్షత్రకుడు,సారంగధరలో సుబుద్ధి,పాశుపతాస్త్రం లో నారదుడు గా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది.1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.
 
ముంజులూరి కృష్ణారావు : నాటకరంగానికి తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి.బందరు రాయల్ థియేటర్ లో చేరి ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు, వేణీ సంహారం లో అశ్వత్థామ, రసపుత్రవిజయం లో దుర్గాదాసు, పండవొద్యోగం , గయోపాఖ్యానం లలో శ్రీ కృష్ణుడు , ప్రతాపరుద్రీయం లో యుగంధరుడు,పిచ్చివాడు, మృఛ్ఛకటికం లో శర్విలకుడుగా నటించారు.1925లో ఏలూరు మోతే నారాయణరావు గారి కంపెనీలో చిన్న చిన్న పాత్రలు ధరించి, వృద్ధాప్యం వల్ల పాత్రపోషణచేయలేక, బందావావి నాట్య పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఒంటరి జీవితం గడిపి అస్తమించారు.
 
ముప్పిడి జగ్గరాజు :(1885 - 1938) స్త్రీ పాత్రపోషణలో అందెవేసినచేయి. కాకినాడ సంగీతం అబ్బాయి గారి కంపెనీలో మల్లమ్మ, యశోధర, లీలావతి, చంద్రమతి పాత్రలను పోషించారు.1902లో రాజమండ్రి లో హిందూ థియేటర్ కంపెనీలో వేణీసంహారం, గయోపాఖ్యానం నాటకాల్లో స్త్రీ పాత్రల్ను ధరించారు.1906లో స్థాపించిన మానేపల్లి కంపెనీలో అంబడిపూడి కోటయ్య గారి ప్రక్కన సారంగధర లో రత్నాంగి, చిత్రనళీయం లో దమయంతి పాత్రలు, కృత్తివెంటి నాగేశ్వర్ రావు మరియు సత్యవోలు గున్నేశ్వర రావు గార్ల నాటకసమాజం లో ప్రముఖ స్త్రీ పాత్రలు ధరించారు.1913 నుండి 1921 వరకు రాజమండ్రి చింతా వారి థియేటర్ లో నిడసినమెట్టు కొండల రావు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావు గార్ల సరసన చంద్రమతి, రత్నాగి, కౌసల్య, దమయంతి, లీలావతి, మైనావతి, సీత పాత్రలను ధరించారు. 1922లో బ్రహ్మజోశ్యుల సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, నిడసనమెట్టు కొండలరావు గార్లతో కలిసి వేణుగోపాల విలాస నాటక సభను స్థాపించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/860285" నుండి వెలికితీశారు