నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
== భౌగోళికం మరియు వాతావరణం ==
[[దస్త్రం:Himalayas.jpg|thumb|250px|left|హిమాలయ పర్వత దృశ్యాలు]]
[[భారత్]] మరియు [[చైనా]] మధ్యలో భౌగోళికముగా నేపాల్ బంధింపబడి ఉన్నది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉన్నది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉన్నది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో ([[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్టు]], ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాలు లో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య.
=== ఎవరెస్టు శిఖరము ===
ఈ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో [[సాగరమాత]] అనీ, టిబెట్ భాషలో [[ఖోమోలోంగ్మ]] అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉన్నది. సమున్నతమైన [[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్టు]] శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు.
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు