"వరంగల్ పట్టణ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

== జిల్లా చరిత్ర ==
[[ఫైలు:Parsvanatha.JPG|thumb|11వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాధుని విగ్రహం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం)]]
క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన [[కాకతీయులు|కాకతీయుల]] రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాలుగు వైపులా శిలా ద్వారాలు కలిగిన పెద్ద కోట ([[వరంగల్ కోట]]), స్వయంభూ దేవాలయము, [[రామప్ప దేవాలయము]] మొదలైనవి వీటిలో కొన్ని. కాకతీయుల పాలనా దక్షత గురించి [[ఇటలీ]] యాత్రికుడు [[మార్కోపోలో]] తన రచనలలో రాసాడు. కాకతీయులలో ప్రముఖకాకతీయ పాలకులు -[[కాకర్త్య గుండన]] , [[మొదటి ప్రోలరాజు (1050-1080)]] , [[రెండవ బేత రాజు (1080 - 1115) ]] , [[రెండవ ప్రోల రాజు(1115-1158) ]] , [[రుద్ర దేవుడు (1158-1195) ]] , [[మహా దేవుడు (1195-1199) ]] , [[గణపతిదేవ చక్రవర్తి (1199-1261) ]], [[రుద్రమ దేవి (1258-1290) ]], [[ప్రతాపరుద్రుడు( 1290-1326) ]].
 
 
పురావస్తు శాఖవారు ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కట్టడం అయిన వేయి స్తంభముల దేవాలయాన్ని మరమత్తు చేయడానికి పూనుకొన్నారు. అయితే వారు జరిపిన త్రవ్వకాలలో ఒక విస్మయం చెందే విషయం బయటపడినది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఆలయం క్రింద ఒక నీటితొ నిండిన బావి బయటపడినది. ఉపరితలం నుండి సుమారు 3-4 మీటర్ల లోతున ఈ బావి ఉంది. అంతేకాకుండా కట్టడం క్రింద అనగా పునాది క్రింద మొత్తం ఇసుకతో ఉండడం మరొక విషయం. ఆకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలా పునాది క్రింద మొత్తం ఇసుకతో కట్టడానికి భూకంపాలనుండి రక్షించడానికి అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ విషయం మీద పురావస్తు శాఖ ఇంకా తన పరిశోధన కొనసాగిస్తుంది.
 
1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో '''తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్)''' పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్దులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్ధులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్ధులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.
 
 
== భౌగోళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/860747" నుండి వెలికితీశారు