"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
'''అమెరికా సంయుక్త రాష్ట్రాలు''' లేదా '''అమెరికా''' [[ఉత్తర అమెరికా]] ఖండములోని [[అట్లాంటిక్ మహాసముద్రము]] నుండి [[పసిఫిక్ మహాసముద్రము]] వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన [[కెనడా]], దక్షిణాన [[మెక్సికో]] దేశాలతో భూసరిహద్దు మరియు అలాస్కా వద్ద [[రష్యా]]తో సముద్ర సరిహద్దు కలదు. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని [[వాషింగ్టన్ డి.సి.]]. ఉత్తర దిశలో [[కెనడా]] దేశం, తూర్పు దిశలో [[అట్లాంటిక్ మహాసముద్రం]], దక్షిణ దిశలో [[మెక్సికో]] మరియు పడమట [[పసిఫిక్ మహాసముద్రం]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున [[అట్లాంటా]] రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బెర్లింగ్ స్ట్రైట్ ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్ర మధ్యలో ఉంది.
ఈ దేశం ఆధీనంలో పసిఫిక్, మరియు కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ కి.మీ2) వైశాల్యం మరియు 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం మరియు జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యంవైవిద్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకున్న దేశంగానే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము ([[చైనా]] వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.
 
<br />
== నామకరణం ==
 
క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా [[అమెరికా]] అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. తరువాత జర్మన్ కార్టోగ్రాఫర్ మార్ట్ వాల్డ్‍సీ ముల్లర్ తన భౌగోళిక చిత్ర పటంలో దీనికి అమెరికా అనే పేరును ప్రతిపాదిస్తూ ప్రపంచపటాన్ని అందించాడు. జులై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటన లో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] అనే పేరు నవంబరు 15, 1777 నుండీనుండి అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. జూలై నాలుగు వివరణలో 13 రాష్ట్రాల స్వాతంత్ర ప్రకటనలో ఈ పేరును యుక్తమైన రీతిగా '''యునైటెడ్ స్టేట్స్''' గా ప్రకటించబడింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో [[కొలంబియా]] అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో [[దక్షిణ అమెరికా]] ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)
 
1777, నవంబర్ 15, జరిగిన రెండవ ఖండాతంత కాంగ్రెస్ మహాసభ కాన్ఫెడరేషన్ యొక్క వ్యాసాల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పదాన్ని దత్తత తీసుకుంది. 1778 న ఫ్రాంకో-అమెరికన్ ఒప్పందం ఈ దేశాన్ని '''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా''' గా పేర్కొన్నది. 1778 జూలై 11 నుండి పరస్పర చెల్లింపు రసీదులలో '''యునటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా''' (అమెరికా సంయుక్త రాష్ట్రం)గా పేర్కొనబడింది. సాధారణంగా పిలవబడే దీని లఘునామం యునటెడ్ స్టేట్స్. యు.ఎస్, యు.ఎస్.ఎ మరియు అమెరికా అనేవి ఇతర లఘు నామాలు. 1700 ల నుండి సామాన్యులు యు ఎస్ ఆఫ్ ఎ అని అంతర్జాతీయంగా స్టేట్స్ అని అంటారు. కొలంబియా అని సాహిత్యంలో, పద్యాలలో పాటల్లో వాడుతుంటారు. ఇది క్రిస్టోబర్ కొంలంబస్ నుండి వచ్చింది. ఈ పేరు కొలంబియా జిల్లాకు పెట్టబడింది.
యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు మరియు 12 వేల సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతి గా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం మరియు గొప్ప నిర్మాణాలు మరియు చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.
 
1492 లో స్పెయిన్ సాంరాజ్య ఒప్పందంతో '''క్రిస్టోఫర్ కొలంబస్''' పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రెల్ 2, 1513, తారీఖున స్పానిష్ వీరుడైన '''జువాన్ పోన్స్ఫోన్స్ డె లియోన్''' తాను
'''లా ఫ్లోరిడా''' గా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్తుత యు.ఎస్ ప్రధాన భూమిలో అడుగు పెట్టిన మొదటిన యురేపియన్ అయ్యాడు. తరువాత ప్రస్తుత సంయుక్త రాష్ట్రాల నైరుతి భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్'''యూ ఫ్రాంస్''' పెద్ద పెద్ద సరసుల చుట్టూ స్థావరాలను ఏర్పరచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ ఖాంతం దుగువ భాగం లోని ఉత్తర అమెరికాలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్తుత జేంస్ టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. తరువాత 1620 పిలిగ్రింస్ మరియు ప్లే మౌత్ కాలనూలు స్థాపించారు.
ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628 లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తరువాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు బ్రిటన్ అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614 లో హడ్‍సన్ నదీ ప్రాంతాలలో న్యూ అమ్‍స్టర్‍డాం మరియు మాన్ హట్టన్ తో చేర్చి డచ్ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.
Image:Robert Byrd official portrait.jpg|రాబర్ట్ బైర్డ్<br />ప్రెసిడెంట్ ప్రో టేంపోరే అఫ్ ది యునైటేడ్ స్టేట్స్'''సెనేట్'''
Image:Official roberts CJ.jpg|జాన్ రాబర్ట్స్ <br /> ప్రధాన న్యాయమూర్తి
Image:Michael Mullen, CJCS, official photo portrait, 2007.jpg|మైఖేల్ ముల్లెన్<br /> చైర్మన్ఛైర్మన్ అఫ్ ది జాయింట్ చీఫ్స్ అఫ్ స్టాఫ్
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/861761" నుండి వెలికితీశారు