ఆహారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 38:
నిషేదం.వ్యవసాయంలో మిగిలిన గడ్డి తదితరాలు పసువుల మేతగా ఉపయోగ పడుతుంది.
=== ఆహారం వ్యాపారం ===
తయారు చేసిన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం ఆహారానికి సంభందిచిన వ్యాపారం. ఇది పూర్వకాలం నుండి ఉంది. అనేక కారణాలచేత మగవారి అండ లేని కుటుంబాలలో ఆడవాళ్ళు తమకు తెసిన వంటనే పిండి వంటలు చేసి అమ్మడం, పూటకూళ్ళు అని ఈరోజులలో మెస్ మాదిరి భోజనాలు వండి భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటారు. అవే తరవాతతరువాత ఫలహారం, కాఫీ, టీ మొదలైనవి అందించే హోటళ్ళు గా రూపు దాల్చాయి. టీ అంగడి, బడ్డీకొట్టు తినుబండారాలను అమ్ముతూ ఉంటాయి. పానీయాలు, పళ్ళ రసాలు ఇలాచిన్నచిన్న వ్యాపారాలన్నీ ఆహారానికి సంభందించినవే. మిఠాయి కొట్లు కొంచెం పెద్ద తరహా తినుబండారాల వ్యాపారం.
ఈ రోజులలో చిన్న కుటుంబాలు, ఆడవాళ్ళు ఉద్యోగాల కారణంగా అంతగా నిర్భంధం లేక సమయం చాలక ఆహారం
ఇళ్ళల్లో చేయడం చాలా తగ్గింది. వడియాలు, అప్పడాలు, ఊరగాయలూ, వరుగులూ, పెరుగూ, ఇడ్లీ, దోశ మొదలైనవి ఇంట్లో తయారు చేసే వస్తువులు ఇప్పుడు వ్యాపార సరళిలో చేసి అమ్మకానికి వస్తున్నాయి. ఆధునిక కాలంలో వీటి రూపు ఇంకామారి తయారు చేసిన వంటకాలు చపాతీలు, పరోటాలు, సైడ్ డిష్ లూ, వివిధ రకాల అన్నాలు గ్రేవీలు, చిప్స్, సీరియల్స్ అనబడే వివిధ సువాసనలతో కలిసిన పదార్ధాలు తాయారీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఆహారానికి సంభందించిన వ్యాపారంలో ఉన్నాయి. ఈ రోజులలో ఆహారం వ్యాపారం చాలా పెద్ద వ్యాపార పరిమితి కలిగిన వ్యాపారాలలో ఒకటి.
"https://te.wikipedia.org/wiki/ఆహారం" నుండి వెలికితీశారు