కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 284:
:ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన [[బూర్గుల రామకృష్ణారావు]] బంధువు అయిన మందుగుల నర్సింగరావు 1957లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ్యుడైనాడు. అప్పటి రాష్ట్రప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినాడు.
;కొత్త వెంకటేశ్వరరావు:
:ఈ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు గెలుపొందడమే కాకుండా అత్యధికసార్లు విజయం సాధించిన అభ్యర్థిగా కూడా రికార్డు ఇతని పేరిటే ఉంది. తొలిసారి 1972లో ఓటమి పొందిననూ ఆ తరవాతతరువాత 1978, 83, 85లలో వరసగా మూడు సార్లు విజయం సాధించాడు. 1989లో తన సోదరుడికి కాంగ్రెస్ టికెట్టు ఇచ్చి గెలిపించాడు. 1994లో తన సోదరుడికి పోటీగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడంతో ఇద్దరూ పరాజయం పొందినారు.
;జూపల్లి కృష్ణారావు:
:నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి ఎన్నికైన జూపల్లి కృష్ణారావు వ్యాపారం వృత్తి నుంచి పైకిఎదిగిన నేత. తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 1999లో ఎన్నికవగా, 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేటాయించగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ రెబెల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009</ref>