గున్నార్ మిర్థాల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Gunnar Myrdal - Sveriges styresmän.jpg|thumb|right|గున్నార్ మిర్థాల్]]
[[స్వీడిష్ ఆర్థిక వేత్తలు|స్వీడిష్ ఆర్థికవేత్త]] అయిన గున్నార్ మిర్థాల్ [[డిసెంబర్ 6]] , [[1898]] లో జన్మించాడు. [[స్టాక్‌హోమ్]] విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1930]] ప్రాంతంలో తన భార్య [[ఆల్వా మిర్థాల్]] తో కలిసి [[సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలు|సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల]] గురించి గ్రంథం రచించాడు. [[1945]] లో గున్నార్ మిర్థాల్ వాణిజ్య కార్యదర్శిగా స్వీడిష్ కేబినేట్ లో ప్రవేశించాడు. 1947 నుంచి 1957 వరకు అతడు [[ఐక్యరాజ్య సమితి]] [[ఐరోపా ఆర్థిక కమీషన్]] కు చైర్మన్ఛైర్మన్ గా వ్యవహరించాడు. దక్షిణాసియాలో 10 సంవత్సరాల పాటు ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి, [[1968]] లో Asian Drama: An Inquiry into the Poverty of Nations గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో మిర్థాల్ ఆసియా దేశాలలోని పేదరికాన్ని వర్ణించాడు. 1960 నుంచి 1967 వరకు మిర్థాల్ స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అర్థశాస్త్రపు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1961లో స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో Institute for International Economic Studies ప్రారంభించినాడు. అతడు అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను [[1974]] సంవత్సరంలో అతనికి [[ఫ్రెడరిక్ వాన్ హేయక్]] తో కలిసి సంయుక్తంగా అర్థశాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] లభించింది. మిర్థాల్ స్టాక్‌హోమ్ స్కూలు ను బాగా ప్రభావితం చేసినాడు. ప్రాథమిక దశలో అతను చేసిన ఆలోచనలను తర్వాత [[జాన్ మేనార్డ్ కీన్స్]] సిద్ధాంతీకరించినాడు. ఇతను [[మే 17]], [[1987]] న మరణించాడు. అతని యొక్క మరో ప్రముఖ గ్రంథం An American Dilemma: The Negro Problem and Modern Democracy.
== బయటి లింకులు ==
* http://nobelprize.org/economics/laureates/1974/press.html
"https://te.wikipedia.org/wiki/గున్నార్_మిర్థాల్" నుండి వెలికితీశారు