చదరంగం (ఆట): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 131 interwiki links, now provided by Wikidata on d:q718 (translate me)
చి Wikipedia python library
పంక్తి 18:
ఈ రోజున, చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించింది. ఈ ఆటను ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 61 కోట్ల మంది చదరంగం క్లబ్బులలోను, ఇంటర్నెట్ లోను, ఈ మైల్ ద్వారాను, ప్రపంచ వ్యాప్తంగా జరిగే పోటీలలో ఆడతారు. చదరంగం ఆడడం బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును.
ఈ ఆటకు కావలసిన సామాగ్రి, ఒక నలుపు తెలుపు గళ్ళు గల బోర్డు, నలుపు, తెలుపు పావులు. ఒక ఆటగాడు తెలుపులను మరొక ఆటగాడు నలుపులను ఎంచుకుంటారు. ఆట ఆరంభంలో 16 తెల్ల పావులు 16 నల్ల పావులు బొమ్మలో చూపిన విధంగా అమర్చి ఉంటాయి, తెల్ల పావులను ఒక ఆటగాడు నియంత్రిస్తే నల్ల పావులను మరి ఒకడు. 16 పావులు: ఒక రాజు (king), ఒక మంత్రి (queen), రెండు ఏనుగులు (rooks), రెండు గుర్రాలు(knights), రెండు శకటాలు (bishops), మరియు ఎనిమిది బంట్లు (pawns). ఆట యొక్క ఉద్దేశ్యం ఎదుటి రాజును కట్టడి([[checkmate]]) చెయ్యడమే, అంటే ఎదుటి రాజు మీద మన దగ్గర ఉన్న ఎదో ఒక పావుతో దాడి చెయ్యడం, ఆ సమయంలో ఎదుటి రాజుకు దాడి (in "[[Check (board game)|check]]") నుండీనుండి తప్పుకొవటానికి ఇంకా ఏ ఎత్తూ లేకపోవటమే. ఆట కనుగొన్నప్పటి నుండీనుండి సైద్దాంతులెంతోమంది వివరమైన ఎత్తుగడలూ, యుక్తులూ పెంపొందించారు.
 
క్రమబద్దమైన చదరంగం ఆటల పోటీల సంప్రదాయం 16 వ శతాబ్ధంలో ప్రారంభించారు. మొదటి అధికారిక [[ప్రపంచ చదరంగ ఛాంపియన్]], [[విల్ హెల్మ్ స్టీనిజ్]] 1886 లో తన టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇదే వరసలో ఈ రోజు [[వ్లాదిమిర్ క్రామ్నిక్]]14 వ ప్రపంచ ఛాంపియను. [[చదరంగం ఒలింపియాడ్స్]] ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. 20 వ శతాబ్ధ ప్రారంభమునుండీప్రారంభమునుండి, [[వరల్డ్ ఛెస్ ఫెదరేషన్]] మరియూ [[ఇంటర్నేషనల్ కరస్పాండెన్స్ ఛెస్ ఫెడరేషన్]], అను రెండు అంతర్జాతీయ సంస్థలు చదరంగం ఆటల పోటీలను నిర్వహిస్తున్నాయి.
 
కంప్యూటర్ శాస్త్రజ్ఞుల ఒక లక్ష్యం, కంప్యూటర్ చదరంగాన్ని సృష్టించడం, అంటే చదరంగం ఆడే కంప్యూటర్ ని సృష్టించడం. ఈ రోజున కంప్యూటర్ చదరంగ సామర్ధ్యత ప్రభావం నేటి ఆట మీద ఎంతో ఉంది. 1997 లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ అయిన [[గారీ కాస్పరోవ్]] మరియూ IBM సృస్టించిన [[Deep Blue]] ఛెస్ ప్రొగ్రాము ల మధ్య జరిగిన పోటీలో గారీ కాస్పరోవ్ ఓటమితో కంప్యూటర్ ప్రొగ్రాము అత్యంత శక్తివంతమైన మానవ ఆటగాణ్ణి కూడా జయించగలదని నిరూపించబడినది. 1990 దశాబ్ధ మధ్యంలో ఇంటర్నెట్ పెరగడంతో పాటు ఆన్ లైన్ చదరంగం కూడా అభివృద్ది చెందింది.
పంక్తి 47:
 
 
చదరంగం అరవైనాలుగు గళ్ళు కలిగిన ఒక చదరపు బల్ల మీద ఆడతారు. ఈ అరవైనాలుగు గళ్ళలో నలుపు తెలుపు గళ్ళు ఒక దాని తర్వాత ఒకటి గా వస్తాయి, అంటే ఒక తెలుపు గడి పక్కన ఒక నలుపు గడి, ఆ తర్వతతర్వాత తెలుపు గడి, అలా.... పావులు రెండు వర్గాలు గా విభజించబడి ఉంటాయి. ఒకటి నలుపు, ఇంకోటి తెలుపు. ఆటగాళ్లు తాము ఆడే పావుల రంగు బట్టి గుర్తించ బడతారు. ఇలా ఇద్దరు ఆటగాళ్లు చెరో పదహారు పావులతో ఆట మొదలు పెడతారు. ఆ పదహారు పావులు ఇవే - ఒక రాజు, ఒక రాణి (మంత్రి అనికూడా వాడుక లో ఉంది), రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, రెండు శకటాలు, మరియు ఎనిమిది సిపాయి పావులు.
 
ఎవరు తెల్ల పావులని తీసుకోవాలి ఎవరు నల్ల పావులని అనే విషయన్ని స్నెహపూర్వక ఒప్పందం ద్వారా కాని, రూపాయి బిళ్ళను పైకెగరేసి కాని నిర్థారించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/చదరంగం_(ఆట)" నుండి వెలికితీశారు