చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 40:
 
=== బాల్యం ===
ఈయన [[జులై 15]], 1901లో నారయణస్వామి, సూరమ్మ దంపతులకు జన్మించాడు. 1921, జనవరి 26న కార్యదీక్షకై గృహపరిత్యాగం చేసాడు. 1921 లోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో [[రాజమండ్రి]]లో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో [[కాకినాడ]]లో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 [[నిజాం సంస్థానం]]లో lM &S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నాడు. 1931లో [[డాక్టరు]] డిగ్రీ పట్టా పొందారు. 1934 లో కమలమ్మగారితో పరిచయం. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అద్యక్షులుగాఅధ్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి [[రంగూన్]]లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ [[పార్లమెంటు]] సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ ([[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]]) అభ్యర్ధిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి [[సెప్టెంబరు 25]],[[1985]]న దివంగతులైనాడు.
 
 
పంక్తి 62:
1930 లో [[హైదరాబాదు]] మెడికల్ కాలేజీలో చదువుతూ 15 రోజులలో పరీక్షలున్నా లక్ష్యపెట్టకుండా- కాలేజి వదలిపెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో [[బులుసు సాంబమూర్తి]], [[దుర్గాబాయ్ దేశ్‌ముఖ్]], [[మొసలికంటి తిరుమలరావు]] లతో కలిసి పనిచేశారు. 1930-31 శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని కాకినాడలో హిందూ స్థానీ సేవాదళ్ శిక్షణాశిబిరానికి కెప్టెన్ గా ఉండి చట్టధిక్కరణ నేరానికి తిరిగి ఒకటిన్నర సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. అప్పుడు [[బెంగాలీ]] డిటెన్యూలతో పరిచయం ఏర్పడింది. వారిదగ్గర [[కమ్యూనిస్టు]] మూలసూత్రాల గురించి వివరంగా తెలుసుకుని ఆ సిద్ధాంతాల వలన ఎంతో ప్రభావితులయ్యారు.
 
డా.రామారావు తూర్పు గోదావరి జిల్లాలో హరిజన ఉద్యమంలో కూడా ఎంతొ చురుకుగా పనిచేశారు. 1935 నుంచి జిల్లా హరిజన సేవా సంఘానికి అద్యక్షులుగాఅధ్యక్షులుగా ఉన్నారు. జిల్లాలో మొట్టమొదటి హరిజన హాస్టల్ ను నిర్వహించారు. అప్పటిలో ఆయన మద్దూరి అన్నపూర్ణయ్య వంటి [[కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ]]కి చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు.
 
1939 లో [[సుభాస్ చంద్రబోస్]] [[కాకినాడ]] వచ్చినప్పుడు గాంధీ అనుయాయులంతా ఆయన రాకను వ్యతిరేకించారు. అప్పుడు బోస్ సభకు రామారావు గారు హాజరై ఆసభ విజయవంతంగా జరిగేందుకు తోడ్పడ్డారు. తరువాత డాక్టర్ చెలికాని కమ్యూనిస్టుగా మారి రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. 1940 లో రామచంద్రపురంలో వైద్య వృత్తిలో స్థిరపడి ప్రజాసేవ చేస్తూ దీనజన బాంధవుడిగా పేరుపొందారు. కామ్రేడ్ [[పుచ్చలపల్లి సుందరయ్య]] వంటి ప్రముఖ నాయకులెందరో రామారావుగారి యింట్లో ఆశ్రయం పొందారు. అనేకమంది పార్టీ ముఖ్యులు నెలల తరబడి వైద్యసహాయం పొందారు.
పంక్తి 70:
తరువాత కాలంలో క్షయవ్యాధితో పాడైన ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఈరెండు ఆపరేషన్లూ శారీరకంగా డాక్టర్ రామారావు గారిని ఎంతో దెబ్బతీశాయి. అయినా ఆయనలోని విప్లవ కార్యదీక్ష ఏమాత్రం కుంటుపడలేదు.
 
1952 లో జరిగిన ఎన్నికలలో [[కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం]] నుంచి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. అనారోగ్యంతో శానిటోరియంలో ఉన్న రామారావుగారు ప్రచారంలో పాల్గొనక పోయినా ఆ ఎన్నికలలో [[మొసలికంటి తిరుమలరావు]], [[బులుసు సాంబమూర్తి]] మొదలైన హేమాహేమీలపై విజయం సాధించారు. శ్రామికజన పక్షపాతిగా ఆయన తనవాణిని లోక్ సభలో సమర్ధవంతంగా వినిపింపచేశారు. సభ దృష్టికి ఆయన తీసుకువచ్చిన ఎన్నోసమస్యలకు సంబంధించి పండిట్ నెహ్రూ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. 1956లో లోక్ సభ స్పీకర్ [[అనంతశయనం అయ్యంగార్]] నాయకత్వంలో [[చైనా]] పర్యటించిన అధికార ప్రతినిధివర్గంలో సభ్యునిగా డాక్టర్ చెలికాని [[చైనా]] అద్యక్షుడుఅధ్యక్షుడు [[మావో]]తో సహా ముఖ్యనాయకులందరినీ కలిసి చర్చలు జరిపారు.
 
రామారావుగారి జీవనసహచరి కమలమ్మగారు 1976 లో మరణించే ముందు ఒక సంవత్సరం పైగా అనారోగ్యంతో మంచంమీద కదలలేని స్థితిలో ఉండిపోయారు. ఆ సంవత్సర కాలమూ రామారావుగారు ఆమె దగ్గరే ఉండి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. "ఇంతమంది ఉండగా ఈ వయసులో మీకెందుకు శ్రమ?" అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు గుండెను కదిలిస్తుంది. "జీవితమంతా రాజకీయాలలో మునిగిన నేను భర్తగా ఆవిడకు న్యాయం చేకూర్చలేకపోయాను. ఈ స్థితిలో ఆవిడకు సేవచేయ్యడం నా బాధ్యత!"అన్నారు. ఆర్ధిక సంబంధాలు బెడిసికొడితే భార్యాభర్తలే పరస్పరం విరోధులుగా మారుతున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థలో డాక్టర్ రామారావుగారి జవాబు ఆయనలోని ఉదాత్తమైన జీవితాదర్శాన్ని తెలియచేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు