శివ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: మరింత
→‎కథ: మరింత
పంక్తి 16:
 
ఇటువంటి కళాశాలలో శివ ([[అక్కినేని నాగార్జున]]) విద్యార్థిగా చేరతాడు. మల్లి ([[శుభలేఖ సుధాకర్]]), ఆశ([[అమల]])తో స్నేహం కలుగుతుంది. అమ్మాయిలను ఇబ్బంది పెట్టటం, అధ్యాపకులని అవమానపరచటం వంటి పనులతో అల్లరి చేస్తున్న జెడి కి శివ తారసపడతాడు. మొదటి సారి స్నేహితుల అభ్యర్థన మేరకు జెడిని క్షమించినా రెండవసారి శివని జెడి కవ్వించి రెచ్చగొట్టటంతో సైకిల్ చైనుతో జెడి, అతని అనుచరులపై తిరగబడతాడు. అంతేకాక కళాశాల ప్రాంగణంలోనే జెడి ని వెంబడించి అతనిని అతికిరాతకంగా శిక్షిస్తాడు. అదివరకూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జెడి శివ తెగింపుకి నిశ్చేష్టుడౌతాడు.
 
ఈ అనూహ్య సంఘటన మరో రెండు పరిణామాలకు దారి తీస్తుంది. మొదటిది జెడి గణేశ్ ని రంగంలోకి దింపగా, రెండవది స్నేహితులు శివని ఎన్నికలలో నిలబడటానికి ప్రోత్సహించటం. కానీ శివ అర్హుడైన తన సహచరుడు జగన్ ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. గణేశ్ శివ ప్రయత్నాలని ఆపమని కోరతాడు. కానీ శివ తమ కళాశాల వ్యవహారాలలో వీధి రౌడీల జోక్యం అనవససరమని స్పష్టం చేస్తాడు.
 
గణేశ్ బెదిరించే ప్రయత్నం చేయటంతో శివ అతనికి కూడా దేహశుద్ధి చేయటంతో వ్యవహారం భవానీ దాకా వెళుతుంది. మొదట ఆగ్రహించినా తర్వాత శివలో భవానీ జెడికి ప్రత్యామ్నాయ శక్తిని గమనిస్తుంటాడు. భవానీ జగన్ ని హతమార్చగా శివ ఎన్నికల్లో నిలబడటానికి అంగీకరిస్తాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/శివ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు