తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 21:
[[గాడిచర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]], [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు [[మద్రాసు]] కన్నెమెరా గ్రంధాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాలనుండి సమాచారం సేకరించేవారు.
 
అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో సైన్సు, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. ''అధర్వవేదం'', ''అద్వైతం'', ''అభిజ్ఞాన శాకుంతలం'', ''అలంకారాలు'', ''అష్టాదశ మహాపురాణాలు'', ''అట్ట బైండు'', ''అష్టాధ్యాయి'' వంటి ఎన్నో వైవిద్యమైనవైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు రాశాడు.
 
"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవుసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంధాలు పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. [[మదనపల్లె]]లో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ [[మద్రాసు]] వచ్చాడు. ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే [[1923]] [[జూలై 12]]న లక్ష్మణరావు మరణించాడు.