పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 78:
 
;''చింతపిక్కలాట.''
ఇది పెద్దవారు మాత్రమే ఆడే వారు. అది కూడ జాతరలపుడు, మహాభారత నాటకాలు జరిగే సందర్బంలోనుసందర్భంలోను డబ్బులు పెట్టిఆడే వారు. ఆడే విధానము:\
సుమారు ఒక అడుగు చదరములో సమానమైన వంద గడులు గీసి అందులో నున్న మధ్య గడిలో వరుసలో అనగా ఒకటి, రెండు, మూడు, నాలుగు..... ఇలా సుమారు ఇరవై గడులు ఉంటాయి. ఆ సంఖ్య ఆ చదరము యొక్క సంఖ్యను తెలియ జేస్తుంది. మిగతా గడులలో అంకెలను ఆ ఇరవై చదరాలలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను వ్రాసి ఉంచుతారు. అనగా ఏ చదరములో ఉన్న అంకెలు యథా తథంగా మరొక చదరంలో ఉండవు. ఈ ఇరవై చదరాలను ఇరవై మంది ముందు పెట్టుకొని వృత్తాకారంలో కూర్చుంటారు. మధ్యలో ఆట నిర్వాహకులుంటారు. ఒక డబ్బాలో ఒకటి నుండి వంద వరకు అంకెలు వ్రాసి ఉన్న చిన్న బిళ్లలుంటాయి. వాటిని కలిపి ఒక్కోసారికి ఒక్క నెంబరు తీసి దాన్ని గట్టిగా అరిచి చెప్తారు. ఆట ఆడేవారు తమ చదరంలో ఉన్న ఆ అంకెకు సంబంధించిన చిన్న గడిలో ఒక చింత పిక్కను పెట్టాలి. ఇలా ఆట కొనసాగుతుండగా..... ఎవరి చదరంలో నైనా చింత పిక్కలు అడ్డంగా గాని, నిలువుగా గాని, లేదా మూలలకు గాని ఉన్న చిన్న గడులలో చింత పిక్కలు అమరితే..... ఆ వ్వక్తి గెలిచానని చెప్పి తన చదరం నెంబరు కూడ చెప్తాడు. నిర్వహకులు కూడ తమ ముందు ఒక చదరంలో వారు చెప్తున్న అంకెల ప్రకారము చింత పిక్కలను పెడ్తారు. గెలిచిన వ్వక్తి తాను పూర్తి చేసిన గడులలోని అంకెలను బిగ్గరగా అరిచి చెప్తాడు. నిర్వహకులు తమ ముందున్న చదరంలో సరిచూసుకొని గెలుపును నిర్థారిస్తారు. ఈ విధానంలో ఒకరికన్న ఎక్కువ మంది ఆటను గెలుస్తారు. ఆట ప్రారంభానికి ముందు, ఆడే ప్రతి ఒక్కరి వద్ద ఒక నిర్ణీతమైన సొమ్మును వసూలు చేస్తారు. అందులో కొంత భాగాన్ని నిర్వాహకులు ఉంచుకొని మిగతా దాన్ని గెలిచిన వారికి ఇస్తారు. ఒక్కరికన్నా ఎక్కువ మంది గెలిస్తే వారికి ఆ సొమ్మును సమానంగా పంచుతారు. ఇందులో మోసం ఏమీ ఉండదు. ఇది చింత పిక్కలాట. కొన్ని రోజుల పాటు జాతరలు, తిరుణాళ్లు మొదలగు వినోద కార్యక్రమాలు జరిగే సందర్బంలోసందర్భంలో మాత్రమే ఆడేవారు. ఇప్పుడు ఈ ఆట పూర్తిగా కనుమరుగైనది.
 
;ఈత: