పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

చి మల్లికార్జునరావు ను, పీలా కాశీ మల్లికార్జునరావు కు తరలించాం: పూర్తి పేరు. మల్లికార్జునరావ
చి Wikipedia python library
పంక్తి 43:
==సినీ ప్రస్థానం==
 
దివంగత నటులు [[రావు గోపాలరావు]] సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో 'తులసి' అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే 'పార్వతీ పరమేశ్వరులు' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరవాతతరువాత 'నాగమల్లి' లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
 
[[వంశీ]] మొదటిచిత్రం 'మంచు పల్లకీ'లో చిన్న పాత్ర పోషించారు. '[[అన్వేషణ]]'లో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే [[అనకాపల్లి]] వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరవాతతరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. '[[తమ్ముడు]]' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ [[నంది అవార్డు]]ను పొందారు. [[ఏప్రిల్‌ ఒకటి విడుదల]], [[కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు]], [[హలో బ్రదర్]]‌, [[అలీబాబా అరడజను దొంగలు]], [[ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]], [[బద్రి]], [[ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు]], [[ఎవడిగోల వాడిది]]... లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం 'మహా నగరంలో'.
 
==పురస్కారాలు==