వై. విజయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 14:
| homepage =
}}
'''ఎనిగండ్ల విజయ''' అలియాస్ '''వై.విజయ''' [[తెలుగు సినిమా]] నటి మరియు నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన [[తల్లిదండ్రులు (1970 సినిమా)|తల్లితండ్రులు]]. శోభన్‌బాబు సరసన కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా చిత్రాలలో నటించింది.
==బాల్యం==
ఈమె తండ్రి ఎనిగండ్ల జ్ఞానయ్య, తల్లి బాలమ్మ.ఈమె తండ్రి సహకార శాఖలో పనిచేస్తుండటంతో వీరి కుటుంబం ఒకచోట స్థిరంగా ఉండేదికాదు. ఆయన [[కర్నూలు]] లో పనిచేస్తున్నపుడు వై. విజయ అక్కడే జన్మించింది. తర్వాత ఆయనకు [[కడప]] పుకు బదిలీ కావడంతో విజయ బాల్యమంతా కడప లోనే గడిచింది. వీరు మొత్తం 10 మంది సంతానం. నలుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు. పది మందిలో విజయ ఐదవది.
ఈమె ఎనిమిదవ తరగతి వరకు కడప ప్రభుత్వ పాఠశాలలో చదివింది., తరువాత రెండు సంవత్సరాలు [[మద్రాసు]] లో [[వెంపటి చిన సత్యం]] గారి వద్ద నాట్యం నేర్చుకొంది. అక్కడే మిగిలిన పాఠశాలవిద్యని మద్రాసులోని కేసరి పాఠశాలలో పూర్తి చేసింది. మొట్టమొదటి నాట్య ప్రదర్శనను కడపలో ఇచ్చినా తరువాత ఎక్కువభాగం తమిళనాడులోనే ఇచ్చింది.
==సినిమా జీవితం==
వెంపటి చినసత్యం దగ్గర నాట్యం నేర్చుకుంటూ ఉండగానే సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాలు. ఆ సినిమా రామవిజేత ఫిలిమ్స్ వారి [[తల్లిదండ్రులు|తల్లిదండ్రులు (సినిమా)]]. ఇందులో హీరో గా శోభనబాబు నటించాడు. మహానటి [[సావిత్రి]] అమ్మమ్మగా, [[జగ్గయ్య]] తాతయ్యగా నటించారు.
దాదాపు 280 తమిళ సినిమాల్లో నటించింది. కొన్ని కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.
 
==వ్యక్తిగత జీవితము==
ఈమెది ప్రేమ వివాహము. జనవరి 27వ తేదీ 1985 లో ఈవిడ తమ కుటుంబ మిత్రుడిని వివాహం చేసుకుంది. ఈమెకుఆయన పేరు అమలనాథన్. ఈయన కడపలోని సెయింట్‌ జోసఫ్‌ కాలేజి ప్రిన్స్‌పాల్‌, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. వారికి ఒక కుమార్తె అనుష్య. ఇంజనీరింగ్ చదివింది. ఈవిడ తన కుటుంబంతో కలిసి [[చెన్నై]] నగరములో స్థిరపడింది. ఈమధ్య కొన్ని ధారావాహికలో కూడా నటిస్తోంది.
 
కడపలో నిర్వహించిన కడప ద్విశాతాబ్ది ఉత్సవాల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా ‘మా కడప ముద్దుబిడ్డ’ని సన్మానించారు.సినిమారంగంలోకి ప్రవేశించినప్పుడు విజయ అనే పేరుతో చాలామంది నటులు వుండడంతో తన ఇంటిపేరైన ‘వై’ని జోడించి వై.విజయగా అందరూ పిలిచేవారు.<ref>http://kadapa.info/telugu/?p=2160</ref>
 
==పేరు తెచ్చిన పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/వై._విజయ" నుండి వెలికితీశారు