మాతృదేవోభవ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6787934 (translate me)
చి Wikipedia python library
పంక్తి 20:
[[మాతృదేవోభవ]] [[1993]] లో విడదలై పలువురి మన్ననలు పొందిన ఒక సినిమా. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, [[క్యాన్సర్]] సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా. ఈ చిత్రంలో తల్లి పాత్రలో [[మాధవి]] నటన అద్భుతం.
==కథ==
శారద ([[మాధవి]]), [[చారు హాసన్]] నడిపే ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. సంగీత అధ్యాపకురాలిగా పనిచేస్తుంటుంది. సత్యం ([[నాజర్]]) అదే అనాథాశ్రమంలో పెరిగి లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. శారదను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. సత్యం వ్యక్తిగతంగా మంచివాడైనప్పటికీ మద్యానికిమధ్యానికి బానిసౌతాడు. కల్లు దుకాణానికి యజమానియైన అప్పారావు ( [[తనికెళ్ళ భరణి]] ) శారద మీద కన్ను వేస్తాడు. అది సత్యానికి తెలిసి అతని దుకాణం ముందే అప్పారావుని అవమానిస్తాడు. అదే సమయంలో శారదకు మెదడు క్యాన్సర్ సోకిందనీ, తను ఇక ఎంతో కాలం బ్రతకదనీ డాక్టర్లు చెబుతారు. అప్పారావు పగబట్టి సత్యాన్ని చంపేస్తాడు. శారద తనలాగే తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది.
==విశేషాలు==
* ఈ చిత్రంలో [[వేటూరి సుందర్రామ్మూర్తి]] రాసిన ''రాలిపొయ్యే పువ్వా నీకు...'' అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి [[శ్రీ శ్రీ]] కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
"https://te.wikipedia.org/wiki/మాతృదేవోభవ" నుండి వెలికితీశారు