"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Hanumanhug.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ezarate. కారణం: (Copyright violation).)
చి (Wikipedia python library)
 
 
లంకా నగర రక్షణార్ధమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు. కాలనాగులవంటి తన బణాలతో వానర సైన్యాన్ని చిందరవందర చేయసాగాడు. సుగ్రీవుడు మూర్ఛపోయాడు. గవాక్షుడు, ఋషభుడు, గవయుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు వేసిన పర్వత శిఖరాలను రావణుడు పిండి పిండి చేసేశాడు. హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు, రావణుని పిడికిలి పోటుకు హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అంగుష్ఠమాత్రుడైఅంగుష్ఠమాతృడై రావణుని చికాకు పరచాడు. నీలుడు అగ్ని పుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతనిని రావణుడు ఎత్తలేకపోయడు. హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రామునివద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్ఛిల్లాడు. తెలివి తెచ్చుకొని మళ్ళీ శరాఘాతం ప్రాంభించాడు.
 
 
[[దస్త్రం:F1907.271.220.jpg|thumb|left|కుంభకర్ణుని కొరికి తప్పించుకున్న సుగ్రీవుడు]]
 
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి, శూలాలతో పొడిచి, ముసలాలతో మోది, ఏనుగులతో త్రొక్కించి, ఏనుగులతో త్రొక్కించి వారు కుంభకర్ణుని నిదురనుండి లేపారు. లేవగానే [[కుంభకర్ణుడు]] మాంసరాసులను సుష్ఠుగా తిని, కుండలతో రక్తం త్రాగి, త్రేవ్చాడు. విషయం తెలుసుకొని, స్నానం చేసి, సర్వాభరణాలు ధరించి, బలకరమైన మద్యంమధ్యం భాండాలతో త్రాగి రావణుని చెంతకు వెళ్ళాడు. అతను నగరంలో నడుస్తుంటేనే భయంతో వానరసేనలు కకావికలమయ్యాయి. అంత వీరుడు రాక్షసులలో మరొకరు లేరని విభీషణుడు చెప్పాడు. అది ఒక యంత్రమని, రాక్షసుడు కాదని, వారు చెప్పి వానర సేనను స్థిమిత పరచారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/864397" నుండి వెలికితీశారు