హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
స్వాతంత్య్రోద్యమంలో నిర్బంధం వున్న ఆ రోజుల్లో అతను బొంబాయిలో ఒక నాయకుడిగా వుండి జైలుకెళ్ళాడు.
==కవి,రచయితగా==
హరీన్‌ వామపక్ష భావాలను అభిమానించి ఆచరించాడు. ఆంధ్రదేశంలో అభ్యుదయ రచయితల సంఘంతో హరీన్‌కు అత్యంత సాన్నిహిత్యం వుండేది. ఆయనకు విశ్వనాథ, కృష్ణశాస్త్రి, అబ్బూరి, శ్రీశ్రీ వంటి కవులతో స్నేహం కుదిరింది. ''హరీన్‌ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్సిఫిరేషన్" అని [[శ్రీశ్రీ]] గారు ప్రశంసించారు. తెలంగాణా సాయుధపోరాటానికి స్ఫూర్తినిస్తూ సుదీర్ఘ కవితను రాశారాయన. అలాగే ఆంధ్రలో కమ్యూనిస్టులపై జరిగిన పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్పందించారు. యలమర్రు-కాటూరుల్లో పోలీసులు గాంధీజీ విగ్రహం చుట్టూ ప్రజలను బట్టలు విప్పి ప్రదర్శించినప్పుడు హరీంద్రనాథ్‌ ఆగ్రహావేశాలతో గొంతెత్తి ఖండిస్తూనే ఆ రెండు గ్రామాలనూ తన రెండు చేతులా పొదుపుకున్నాడు. ఆయన కవితకు ఆరుద్ర అనువాదమిలా వుంది:
<poem>
అచ్చంపేటా నీవొక/ అసామాన్య కుగ్రాం
తెలంగాణా పల్లెలన్నీ/ మిళితమాయే నీలోనే
నీ గ్రామపు సంగ్రామం/ నిజముగా ఏకాకిగాదు
కొరియాలో మలాయాలో/ కొరకరాని వియత్నామున
బర్మా, ఇండోనేషియా/ పల్లెలు నీ చెల్లెళ్ళు
</poem>
 
ఈ నేపధ్యంలో 'ఫీస్ట్‌ ఆఫ్‌ ట్రూత్‌', 'ది మ్యూజిక్‌ ట్రీ', 'పెర్‌ప్యూమ్‌ ఆఫ్‌ ఎర్త్‌', 'అవుటాఫ్‌ ది డీప్‌', 'ది విజార్డ్‌', 'మాస్క్‌ ది డిలైన్‌', 'క్రాస్‌రోడ్స్‌', 'నాగాలాండ్‌ కర్డ్‌ సెల్లర్‌' వంటి పుస్తకాలు రచించారాయన.
 
==పార్లమెంట్ సభ్యునిగా==