వరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం చేర్చితిని
చి Wikipedia python library
పంక్తి 75:
 
==పండించే విధానం==
ఆరోజుల్లో వరి పంట పండించాలంటే ..... పొలాన్ని మూడు సార్లు [[మడక]] తో దున్ని, చువరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. నీళ్లలో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అని, నీళ్లు లేకుండా మెట్ట పొలాలలో దున్నే దుక్కిని [[వెలి దుక్కి]] అని అంటారు. వెలి దుక్కికి తగుమాత్రం తేమ వుండాలి. తేమ ఎక్కువగా వుంటే దున్నరు. ఆ తేమ శాతాన్ని [[పదును]] అంటారు. అడుసు దుక్కి దున్నిన తర్వాత ఒకపెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒక సారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురద లోనికి తొక్కుతారు. ఆకు అనగా, [[కానుగ]], [[వేప]], [[గంగ రావి]], [[జిల్లేడు]] మొదలగు ఆకు తెచ్చి అడుసు లో వేసి తొక్కుకాతారు. పొలాల గట్టు మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి [[మోపు]]లుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు. ఇది పంటకు చాల సారవంత మైన [[సేంద్రియ ఎరువు]]. తర్వాత అది వరకే నారు పోసి వుంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు. ఆడ కూలీలు వచ్చి నాట్లు వేస్తారు. ఈ కూలీలు నాట్లు వేస్తూ పాటలు పాడతారు. ఈ పాటలు ఒకరు ఒక [[నుడుగు]] పాడితె మిగతా వారు కోరస్ గా పాడు తారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా, ఆ పాటలు విన సొంపుగా ఎంతో ఆహ్లాద కరంగా వుంటుంది. మద్యాహ్నమధ్యాహ్న సమయానికి పొలం యజమాని ఇంటి నుండి కూలీలకు (అన్నం) సంగటి వస్తుంది. అప్పుడు కూలీలు బయటికి వచ్చి తమ బురద కాళ్లను కడుక్కొని చెట్టు కింద కూర్చొని చేతిలో సంగటి ముద్దను వేయించుకొని తింటారు. కొందరు చిన్న పిల్ల లున్న తల్లులు రెండు ముద్దల సంగటిని కొంగులో వేసుకుని మూట గట్టుకొని తాము తెచ్చుకున్న గిన్నెలో కూర పోయించు కొని ఇంటి కెళ్లి తమ పిల్లలకు అన్నం పెట్టి, చంటి పిల్లలుంటే వారికి పాలిచ్చి తిరిగి పనిలోకి వస్తారు. పొద్దు పోయిందాక వారు పని చేసేవారు.
;[[దస్త్రం:Gutta kiMda vari polaM.JPG|thumb|right|గుట్టకింద వరి పొలం, దామలచెరువు దగ్గర తీసిన చిత్రం]]
[[దస్త్రం:Paddy field.JPG|thumb|right|పొట్టకర్ర మీదున్న వరి పొలము]]
వరి నాటిన నాలుగు వారాలకు కలుపు తీయాలి. ఇది కూడ బురదలో పనే. ఆడవారి పనే. తెల్ల వారి [[సద్దులు]] తాగి పనిలోకి దిగితే మద్యాహ్నంమధ్యాహ్నం ఒంటిగంటకు [[సంగటి]] తిని అరగంట అలసట తీసుకుని మల్లీ పనిలోకి దిగుతారు. కలుపు తీత లో కూడ వీరు పాటలు పాడుతారు. వరి నాట్లు, కలుపు తీయడం ఈ రెండు పనులలోనె ఈ పాటల కార్యక్రమం వుంటుంది. మిగతా ఏ పనిలోను ఈ కోరస్ పాటలుండవు. ఈపాటలు వారికి పనిలోని అలసటను మరిపించి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.ఆ రోజుల్లో ఈ కూలివారికి డబ్బురూపంలో కాక వస్తు రూపంలో కూలి ఇచ్చేవారు. అనగా ఒక కూలికి రెండు బళ్ళల వడ్లు ఇచ్చేవారు. ఆతర్వాత కొంత కాలానికి డబ్బులను కూలీగా ఇచ్చే పద్దతి వచ్చింది. ఏ పనికైనా కూలిగా డబ్బులు తీసుకున్నా వరి పంటకు సంబందించిన పనికి మాత్రము... వడ్లను మాత్రమే కూలిగా తీసుకునేవారు. కొంత కాలానికి అన్ని పనులకు డబ్బులే కూలిగా ఇచ్చే పద్దతి వచ్చింది. మెదట్లో ఒక మనిషి కి ఒక రోజుకు కూలి అర్థరూపాయి గా వుండేది. ఆ తర్వాత.... తర్వాత అది పెరిగి ఈ రోజుకి అనగా 2011 వ సంవత్సరానికి 150 రూపాయలైంది. పని గంటలు మాత్రము తగ్గినాయి. అప్పట్లో పొద్దున ఎనిమిది గంటలకు పనిలోకి వస్తే సాయంత్రం పొద్దు పోయిందాక పని చేసే వారి. ఇప్పుడు పొద్దున 8 గంటలకు పనిలోకి దిగి మద్యాహ్నంమధ్యాహ్నం భోజన సమయానికి అనగా ఒంటి గంటకు దిగి పోతారు.
 
=== శ్రీ వరి ===
"https://te.wikipedia.org/wiki/వరి" నుండి వెలికితీశారు