వర్షం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 134 interwiki links, now provided by Wikidata on d:q7925 (translate me)
చి Wikipedia python library
పంక్తి 28:
 
=== పర్వతీయ వర్షపాతం (నిమ్నోన్నత వర్షపాతం) ===
సముద్రాలు మరియు భూభాగములు సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కటంలో గల భేదాల మూలంగానూ, నిరంతరము వీచే ప్రపంచ పవనాల మూలంగా కూడా సముద్రాల ఉపరితలం నుండీనుండి భూభాగం మీదికి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇలాంటి పవన మార్గానికి అడ్డంగా ఎత్తైన కొండగానీ, [[పర్వతం]]గానీ, వాలు ఎక్కువ ఉండే [[పీఠభూమి]] అంచుగానీ అడ్డు తగిలినపుడు తేమతో కూడిన గాలి ఎత్తుగా ఉండే అడ్డంకి దాటడానికి పైకి లేస్తుంది. గాలి పైకి వెళ్లే కొద్ది వాయు పీడనం తగ్గటం వలన వ్యాకోచిస్తుంది. [[వాయు నియమాలు|వాయు నియమాల]] ప్రకారం వ్యాకోచించే గాలి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. తత్ఫలితముగా దాని యొక్క [[సాపేక్ష ఆర్ద్రత]] పెరిగి, గాలిలోని నీటి ఆవిరి, నీటి బిందువులుగా ధ్రవీభవనం చెంది మేఘాలు ఉత్పన్నమవుతాయి. ధృవీభవన స్థాయి (పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి ధ్రవీభవనం సంభవించే ఎత్తును ద్రవీభవన స్థాయి అంటారు)ని చేరుకొనే వరకు సాపేక్ష ఆర్ద్రత క్రమంగా మరింత పెరిగి, గాలిని సంతృప్తం చేస్తుంది. మేఘాలు తేలుతూ ఉండటానికి బరువైనపుడు వర్షపాతం సంభవిస్తుంది. ఈ ప్రక్రియ అడ్డంకిగా నిలచిన భూస్వరూపం యొక్క [[పవానాభిముఖ పార్శ్వము]]లో భారీ వర్షాన్నిస్తుంది. భూస్వరూపం యొక్క ఆవలివైపున ఆర్ద్రత కోల్పోయి పొడిగా ఉన్న పవనం, క్రిందికి దిగుతూ సంకోచించి మరింత వెచ్చగా మారుతుంది. పవానాభిముఖ పార్శ్వములో గాలిలోని తేమనంతా వర్షంగా కోల్పోయి పొడిగా ఉండటం వలన ఈ ప్రాంతములో వర్షపాతము సంభవించదు. ఆ కారణముచే, ఈ ప్రాంతాన్ని[[వర్షచ్ఛాయా ప్రాంతం]] అంటారు.
 
పర్వతీయ వర్షపాతానికి [[హిందూ మహాసముద్రం]] నుండి ప్రారంభమయ్యే [[ఋతుపవనాలు]] ఒక మంచి ఉదాహరణ. [[భారత దేశము]]లో కలిగే వర్షపాతములో 80% వర్షం ఈ కోవకు చెందినదే.
"https://te.wikipedia.org/wiki/వర్షం" నుండి వెలికితీశారు