పుష్ప విలాపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసం రూపంలో మార్పు
పంక్తి 1:
'''కరుణశ్రీ'''గా ప్రసిద్ధులైన '''జంధ్యాల పాపయ్య శాస్త్రి''' రచించిన [[ఖండకావ్యం]]లోని ఒక కవితా ఖండంపేరు '''పుష్పవిలాపం'''. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. ఐతే అమరగాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] పాడిన గ్రామఫోను రికార్డుల వలన ఈ పద్యాలు ఆంధ్రదేశమంతటా మారు మ్రోగాయి.
 
==విషయం==
ఒక పేదవాడు పూజకోసం పూలుకోయాలని పూలతోటకు వెళ్ళినపుడు అతనికి ఆ పూల ఆవేదన మనసులో మెదిలింది. హాయిగా చెట్టుపైనున్న పూలను కర్కశంగా కోసి, సూదులతో గ్రుచ్చి, త్రాళ్ళతో బిగించి, మానవులు తమ భోగ వస్తువులుగా వాడుకోవడం క్రౌర్యం అని ఆ పూలు రోదిస్తున్నట్లుగా కవి వర్ణించాడు.
 
==ప్రత్యేకత==
 
* పూల గురించి కవులు, కావ్యాలు పలు విధాలుగా వర్ణించారు. కాని ఈ విధంగా స్పందించడం బహుశా తెలుగులో ఇదే ప్రధమం కావచ్చును.
* ఇందులో పద్యాలు తేలిక పదాలతో అందరికీ అర్ధమయ్యేలాగా, ఆలోచింపజేసేలాగా ఉన్నాయి.
* కరుణా రసం జాలువారుతున్నట్లున్న ఇటువంటి పద్యాలవల్ల కవికి '''కరుణ శ్రీ" అనే బిరుదు సార్ధకమయ్యింది.
 
 
==ఉదాహరణలు==
 
:నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
:గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
:నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
:బావురుమన్నవి కృంగిపోతి నా
:మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
 
 
:ఊలు దారాలతో గొంతుకురి బిగించి
:గుండెలోనుండి సూదులు గుచ్చి కూర్చి
:ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
:అకట దయలేనివారు మీ యాడవారు
 
 
:బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
:సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
:అందమును హత్య చేసి హంతకుండా
:మైలపడిపోయెనో నీ మనుజ జన్మ
 
[[వర్గం:రచనలు]]
 
 
 
{{వికీసోర్స్‌కు తరలింపు}}
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ
"https://te.wikipedia.org/wiki/పుష్ప_విలాపం" నుండి వెలికితీశారు