సి.ఆర్.సుబ్బరామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 40:
1943లో తమిళనాడు టాకీస్ సంస్థ వారు [[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ సమయంలో [[చిన్నయ్య]] మరణించడం, తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన [[ఎస్.రాజేశ్వరరావు]] తప్పుకోవడం జరిగింది. దానితో [[సముద్రాల రాఘవాచార్య]] గారి ప్రోత్సాహంతో వీరు మిగిలిన పాటలు పూర్తి చేశారు.
 
తరువాత తెలుగులో విడుదలైన [[రత్నమాల]] చిత్రానికి సంగీతం చేకూర్చి మధురమైన బాణీలతో అందరినీ అలరించారు. ఈ చిత్రంలో [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారు వీరి వద్ద సహాయకులుగా చేరారు. [[లైలా మజ్ను]] చిత్రం వీరిని ఆకాశానికెత్తింది. ఆ చిత్రానికి అరేబియన్ సంగీత పోకడలను ప్రవేశపెట్టారు. అలాగే పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసి తెలుగు తెరకు నూతన వరవడిని దిద్దారు. సుబ్బరామన్‌ కు సహాయకులుగా పనిచేసినవారంతా తరవాతతరువాత గొప్ప సంగీతదర్శకులయారు. వారిలో ముఖ్యులు ఘంటసాల, విశ్వనాథన్‌, రామమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి (వయొలిన్‌ వాయించేవారు), ఆర్‌.ఎస్‌.గోవర్ధనం, సుబ్రహ్మణ్యం (మేండొలిన్‌) రాజు, లింగప్ప తదితరులు.
 
1950లో వినోదా వారి చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యారు. ఆ సంస్థ తెలుగు చిత్రాలలో మణిపూసగా పేర్కొనబడే [[దేవదాసు]] చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి వీరి సంగీతం అత్యుత్తమమైనది.
"https://te.wikipedia.org/wiki/సి.ఆర్.సుబ్బరామన్" నుండి వెలికితీశారు