ప్రధాన మెనూను తెరువు

మార్పులు

9 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
సింగపూరు అనే పేరుకు సంస్కృత పదమైన సింహపుర్ (सिंहपुर)మూలమని ఇక్కడ ప్రజల విశ్వాసము. 14 వ శతాబ్ధములో సుమత్ర మలయ్ రాజకుమారుడు '''సన్గ్ నిల ఉతమ''' తుఫానులో చిక్కుకొని ఈ దీవిలో అడుగు పెట్టినపుడు అతనికి ఒక మృగము కనిపించింది. దానిని అతని మంత్రి సింహముగా గుర్తించాడు. ఆ కారణంగా దీనికి సింగపూర్ అన్న పేరు స్థిర పడింది. కానీ ఇటీవలి పరిశోధనలు సింగపూరులో సింహాలు ఎప్పుడూ నివసించిన దాఖలాలు లేవని నిర్ధారించారు. రాజకుమారుడు '''సన్గ్ నిల ఉతమ''' చూసిన మృగము మలయ్ పులి అయి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
 
ప్రారంభంలో ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్(సముద్ర పురము) అనే జవనెసె నామముతో వ్యవహరించబడి క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరవాతతరువాత క్షీణదశ ఆరంభమైంది. పురాతన అవశేషాలు ఇంకా తెమసెకలో మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు. 16వ శతాబ్ధము నుండి 19వ శతాబ్ధపు ప్రారభం వరకు జోహర్లో ఒక భాగంగా ఉంది. ఈ సమయములో ఈ ద్వీపము జాలరుల నివాసస్థలంగా ఉంటూ వచ్చింది.
 
[[1819]]వ సంవత్సరము [[జనవరి 29]] వ తేదీన ఈ ద్వీపంలో కాలిడిన థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్ భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చినివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటము ఆరంభము అయినది. [[1858]] వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన [[1867]] వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రము కిందకు చేరింది. క్రీ.శ. [[1869]] వ సంవత్సరానికి జనసంఖ్య 1,00,000 కు చేరుకుంది.
బ్రిటిష్ కాలనీ ఆరంభం నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల,బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.
 
రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము ఆంగ్లేయ సైనికుల అసమర్ధత కారణంగా [[1942]] వ సంవత్సరము [[ఫిబ్రవరి 15]]వ తేదీన 6 రోజుల యుద్ధము తరవాతతరువాత జపాను సైన్యంచే ముట్టడించబడి [[జపాను]] వశమైంది. ఈ యుద్ధము బ్రిటిష్ సైన్యము యొక్క అతి పెద్ద వైఫల్యముగా [[చర్చిల్]] చే వర్ణించబడింది.
1945 వ సంవత్సరము సెప్టెంబర్ 12 వ తేదీన జపానీయుల లొంగుబాటు తరువాత తిరిగి ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వశపరచుకుంది.
 
 
== విద్యావిధానం ==
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. 50 శాతం విద్యార్ధులు తమ స్కూలుకు ముందు దశ తరగతులలోనే ఇంగ్లీష్ మాధ్యమంతో విధ్యారంభం చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు కిండర్ గార్డెన్ చదువు ప్రారంభిస్తారు.ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు దశ తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. వీరి అధికారిక పార్టీకి చెందిన సంస్థలే ఎక్కువ శాతం ఆరంభ పాఠశాలలను నిర్వహిస్తుంటాయి. పాఠశాలలలు ఎక్కువగా గణితము ,సామాన్యశాస్త్రము మొదలైనవి ఇంగ్లీష్ లోనూ, మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను రెండవ భాషగానూ బోధిస్తుంటాయి.విశేషాధికారాలు కలిగిన కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ వారి పిల్లలకు బోధిస్తూ ఉంటాయి.పాఠశాలల నిర్వహణపై కఠిన కట్టుబాట్లు లేని కారణంగా ఇక్కడ విద్యా సంస్థలు రకరకాలైన విధానాలతో నడుపుతూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు,ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు, విశేషాధికారాలు కలిగిన పాఠశాలలు, స్వతంత్ర్య పాఠశాలలు మరియు ప్రజా సంస్థల నిధులతో నడిపే పాఠశాలలు ఇక్కడి విద్యావిధానంలో భాగాలు. విద్యావిధానంలో చేరని మూడు సంవత్సరాల కిండర్ గార్డెన్ (ప్రాధమిక విద్యకు ముందు తరగతులు)తరవాతతరువాత 6 సంవత్సరాల ప్రారంభ విద్య . స్కూల్ లీవింగ్ పరీక్షల తరువాత ఎంచుకున్న పాఠ్యాంశాలతో 4 నుండి 5 సంవత్సరాల మాధ్యమిక తరగతులు అనంతరం న్ లెవెల్ లేక ఒ లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు.జూనియర్ కళాశాలలు 2 నుండి 3 సంవత్సరాల ప్రి యీనివర్సిటీ తరగతులు నిర్వహిస్తాయి.
 
== భాష ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865103" నుండి వెలికితీశారు