"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
=== ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు ===
అతడిని చూసి [[సంజయుడు]] " ధృతరాష్ట్ర మహారాజా ! నీకు తెలియని శాస్త్రాలు లేవు అన్నీ తెలిసిన నీవే ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా ! ఇంతకు ముందు నీవు సృంజయుడి కధ విన్నావు కదా ! అభిమన్యుడి మరణానికి [[ధర్మరాజు]] దుఃఖిస్తుంటే నారదుడు ఈ కధ చెప్పాడు అది విని కూడా నీవు ఇలా దుఃఖిస్తున్నావా ! నీ మంచికోరే మంత్రుల మాట వినలేదని అన్నావు కదా ! నీకూ, నీ కుమారుడికీ [[శకుని]], దుశ్శాసనుడు, [[కర్ణుడు]] వీరే కదా మంత్రులు ! వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది మరేమిటి. నీ కొడుకు ఎదుటి వాడి మీద కత్తి దూసాడే కాని మంత్రాంగం మీద దృష్టి మరల్చాడా ! [[విదురుడు]] చెప్పింది విన్నాడా ! నీవు అతడికి బుద్ధిచెప్పి అతడిని కట్టడి చేసి అతడి అకృత్యాలను ఆపగలిగావా ! నీకూ నీ కుమారుడికీ లోభత్వం బాగా వంటబట్టి ఎవరి మాటా వినలేదు. కనుక నీ దు:ఖం మాను. నీ పని ఎలా ఉందంటే చుట్టూ మంట పెట్టుకుని మద్యలోమధ్యలో కూర్చుని అయ్యో కాలిపోతున్నాను అని గొంతెండి పోయేలా అరచినట్లు ఉంది. ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కాని జాలి చూపుతారా ! నీ కుమారుడి పరుషవాక్యాలకు అర్జునుడి కోపాగ్నికి వారంతా దగ్ధం అయ్యారు. ఇక విచారించడం ఎందుకు " అన్నాడు.
 
=== ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట ===
 
=== ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొందుట ===
విదురుడి మాటలకు [[ధృతరాష్ట్రుడు]] దుఃఖోపశమనం పొంది " విదురా ! నీ మాటలు నా దుఃఖాన్ని ఉపశమింప చేసాయి. విదురా ! నీవు చెప్పినట్లు జ్ఞానులకు పండితులకు అప్రియములు ప్రియములు అనేవి లేకుండా అంతా సమానంగా చూస్తారని చెప్పావు కదా ! వారు అలా ఎలా ఉండగలరు " అని అడిగాడు. [[విదురుడు]] " ఓ ధృతరాష్ట్ర మహారాజా ! సంసారమనే వృక్షము అరటి చెట్టు వలె దుర్బలమైంది, నిస్సారమైనది. కాని మానవుడు ఈ సంసారం అందే అనురక్తుడై నిరంతర వ్యధకు గురి ఔతున్నాడు. ప్రస్థుతం మనకు లభించిన ఈ శరీరం పతనమై మరొక శరీరం లభిస్తుంది అంతేకాని ఈ శరీరం శాశ్వతం కాదుకదా ! అది తెలుసుకున్న వాడు నీ మాదిరి వ్యధచెందడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరి జీర్ణమైన ఒక వస్త్రమును వదిలి నూతనమైన వేరొక వస్త్రమును ధరించిన మాదిరి ఒక శరీరం వదిలి వేరొక శరారాన్ని ధరిస్తాడు. కుమ్మరి వాడు కుండను చేసే సమయంలో మద్యలోనేమధ్యలోనే విరుగ వచ్చు, లేకున్న కుండగా తయారైన తరువాత విరుగవచ్చు, దానిని కాల్చే సమయాన విరిగి పోవచ్చు, వాడుకునే సమయాన కింద పడి విరిగి పోవచ్చు. కనుక ఈ మట్టి కుండ ఏ దశలో విరుగుతుందో చెప్ప లేము కదా ! మానవుడూ అంతే ! పురుషుడి తేజస్సు స్త్రీ అండముతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అది అండ దశలో విచ్ఛిత్తి కావచ్చు, ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో కాని ప్రసవ సమయంలో కాని, శిశువుగా జన్మించిన తరువాత గాని, బాల్యంలో కాని, యవ్వనంలో కాని, వృద్ధాప్యంలోగాని ఎప్పుడైనా సంభవించ వచ్చు. కనుక ఈ శరీరం ఎప్పుడైనా మరణించ వచ్చు. కనుక మరణానంతరం మనం చేసే సుకృత, దుష్కృత ఫలితంగా స్వర్గనరకములు ప్రాప్తిస్తాయి. కనుక మరణించిన వారి కొరకు దుఃఖించడం అవివేకం. వివేకం కల వారు ఈ సంసారం దుఃఖభూయిష్టం అని ఎరిగి దాని అందు చిక్కుకొనరు. కనుక నీవూ చచ్చిన పుత్రులకొరకు విచారించక నీవు ముక్తి పొందే మార్గం ఆలోచించు " అని చెప్పాడు విదురుడు.
 
=== ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865202" నుండి వెలికితీశారు