జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
==హద్దు పద్దు లేకుండా==
పెద్దా, చిన్నా బేధము లేకుండా
==శరాఘాతం==
గట్టిదెబ్బ అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తుపాకులు లాంటివి వాడుకలోకి రాకముందు దూరంగా ఉన్న లక్ష్యాన్ని సైతం గట్టిగా కొట్టడానికి బాణం ఉపకరించేది. ఆ భావన ఆధారంగానే ఈ జాతీయం అవతరించింది. మంచి విలుకాడు దూరం నుంచి బాణంతో లక్ష్యాన్ని చేధించిన విధంగా ఎవరైనా ఎదుటివారిని గట్టిదెబ్బ తీసిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. 'ప్రతిపక్షం వారి విమర్శ ప్రభుత్వానికి శరాఘాతమయ్యింది' అనే సందర్భంలో ఈ ప్రయోగం కన్పిస్తుంది.
==చేతులు కలపడం==
చేయి కలపడం అనే రూపంలో కూడా కనిపించే ఈ జాతీయం ఇద్దరు వ్యక్తులు ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒకటి కావడమనే అర్థంలో
ప్రయోగంలో ఉంది. 'నిన్నటి దాకా అభిప్రాయ భేదాలతో ఉన్నవారు మధ్యవర్తి పుణ్యమా అని చేతులు కలిపి ముందుకు నడుస్తున్నారు' అనే
లాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
==మంటపెట్టు==
కుట్ర జరపటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. అంతా సవ్యంగా జరిగే చోట ఎవరైనా దుర్మార్గపు బుద్ధితో కుట్ర చేస్తే అక్కడంతా అశాంతి అలముకుంటుంది. అప్పటిదాకా ఉన్న చక్కటి వాతావరణమంతా నాశనమైపోతుంది. చక్కగా ఉన్న వస్తువుకు మంటపెడితే అది ఎలా పనికిరాకుండా నాశనమై పోతుందో కుట్ర జరిగిన చోట కూడా శాంతియుత వాతావరణం అలాగే నాశనమవుతుందన్న భావనతో ఈ జాతీయం ఆవిర్భవించింది. 'అసమ్మతివాదులు మంటపెట్టారు. దాంతో ఆ రాజకీయ పక్షం మొత్తం ఎన్నికల్లో కనిపించకుండా పోయింది' అనే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
==వేరుకుంపటి==
విడిపోయి ఎవరికి వారు స్వతంత్రంగా ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కలిసి ఉన్నప్పుడు ఒకే పొయ్యిమీద వండుకుని ఒక కుటుంబానికి చెందినవారంతా హాయిగా ఉండడం జరుగుతుంది. కారణాంతరాలవల్ల ఆ ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఎవరికివారు వేరుగా కుంపట్లు పెట్టుకుని ఎవరి వంట వారు వండుకుంటారు. ఈ భావన ఆధారంగా అప్పటిదాకా కలిసివున్న మిత్రులు విడిపోయిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'నిన్నటిదాకా కలిసివున్న ఆ నాయకులు వేరుకుంపటి పెట్టినట్లు కొత్తపార్టీలను పెట్టుకొని ప్రజలముందుకు వచ్చారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==అడ్డదారులు తొక్కడం==
అక్రమ పద్ధతులను అనుసరించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒకదారి నిర్దేశితమై ఉంటుంది. ఆ దారిలో పదిమంది నడుస్తూ ఒక క్రమపద్ధతిని అనుసరిస్తే అంతా సక్రమంగా ఉంటుంది. అలా కాక అందులో ఎవరైనా స్వార్థబుద్ధితో ప్రవర్తించి అందరికంటే ముందుగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడానికిగాను నిర్దేశించిన మార్గంలో కాక వెళ్లకూడని విధంగా అడ్డదోవలో వెళ్లినప్పుడు అతడు లక్ష్యాన్ని చేరవచ్చేమోకానీ ఆ అడ్డదోవలో వెళ్లినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. ఎవరి ఇళ్ల మధ్య నుంచి వెళ్లడమో, లేదా మరెవరి పొలం మధ్యనుంచో వెళ్లడమో చేస్తే ఆయా వ్యక్తులకు అసౌకర్యం కలగవచ్చు. ఎదుటివారి అసౌకర్యాలను లెక్కించక తన లాభం కోసం ప్రయత్నించడం పదిమందినీ బాధిస్తుంది కూడా. ఇలాంటి భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'అడ్డదారులు తొక్కి, ఎంతమందినో బాధించి సంపాదించాడు.ఇప్పుడు పట్టుబడి జైలుపాలయ్యాడు' అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.
==ప్రసవవేదన==
అత్యంత కష్టసాధ్యమైన విషయాన్ని గురించి వివరించేటప్పుడు ఈ జాతీయాన్ని పేర్కొనటం కనిపిస్తుంటుంది. మాతృమూర్తి ప్రసవ సమయంలో ఎంత వేదనను అనుభవించి ప్రసవం అయ్యాక తన బిడ్డను ఆనందిస్తుందో, అలానే ఎవరైనా ఎంతో కష్టపడి చివరకు ఫలితాన్ని పొందినప్పుడు ఈ జాతీయంతో సూచించటం జరుగుతుంటుంది. 'ఈ విజయాన్ని సాధించటానికి వాడెంతో ప్రసవవేదన అనుభవించాడు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.
==ఒడినిండటం==
సంతాన భాగ్యం కలగటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఆడ బిడ్డలకు తల్లిదండ్రులు చీర సార పెట్టేటప్పుడు ఒడిలో బియ్యం పోస్తారు. ఒడి నిండుగా ఉండాలని ఆశీర్వదిస్తారు. ఈ సందర్భానికి అర్ధం ఆ ఆడబిడ్డ సంపద, సౌభాగ్యాలతో విలసిల్లాలని. ఒడిబియ్యం ఆచారం అలాంటి అర్ధాన్ని చెబుతుంటే ఒడి నిండటం అనే ఈ జాతీయం అచ్చంగా సంతాన భాగ్యాన్ని కలిగి ఉండడం అనే దాన్ని చెబుతుంది. తల్లి ఒడిలో బిడ్డ ఉన్నప్పుడు ఆ ఒడి నిండుగా ఉంటుంది. ఈ భావనే ఈ జాతీయ ఆవిర్భావానికి మూలం. 'ఆ దేవుడు తొందరగా నీ ఒడి నింపాలి' అని ఆశీర్వదించే సందర్భాలలో ఈ ప్రయోగాన్ని గమనించవచ్చు.
 
([[హిందీ భాష]]లో "గోద్ భరనా" అన్న జాతీయం ఇదే అర్ధంలో వాడుతారు)
 
==అగ్గి బుక్కు==
ఇది తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో వినిపించే జాతీయం. కోపంతో ఉడికి పోవటం అనేది దీని అర్థం. నిప్పులు కక్కడం లాంటి రూపాల్లో ఇతర ప్రాంతాల్లో వినిపిస్తుంటుంది. అగ్గి అంటే అగ్ని అని బుక్కు అంటే బొక్కటం అని అర్థం. 'నీవు చేసిన పనికి పటేల్‌ అగ్గి బుక్కుతున్నాడు' అనే లాంటి సందర్భాలు ఉన్నాయి.
==ముక్కు పిండి==
బలవంతంగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. లొంగని వారిని ఏదో ఒక విధంగా బెదిరించో, భయపెట్టో లోబరుచుకొనే సందర్భాల్లోను, ఎవరైనా డబ్బులు చెల్లించటానికి ఇష్టపడనప్పుడు ఏదో ఒక గట్టి ప్రయత్నం చేసి డబ్బులు చెల్లించేలా చేసే సందర్భాల్లోను ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'ముక్కు పిండి మరీ ఆనాడు డబ్బులు తీసుకొని ఇప్పుడు పని చేయటం లేదు చూడండి' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగం ఉంది.
==వేడెక్కటం==
ఉద్ధృతం కావటం అనే అర్ధంతో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చల్లపడటం అంటే నిస్సారంగా, నిస్తేజంగా ఉండటం అనే అర్ధం అన్నట్లుగానే వేడిలో ఉంటే శక్తిని దృష్టిలో ఉంచుకొని విపరీతంగా చలనం కలిగినప్పుడు ఏ విషయాన్ని గురించైనా క్రియాశీలత ఎక్కువైనప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ' పోలింగ్‌ తేదీ దగ్గర పడటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది' అని అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
==మోత మోగడం==
విస్త్రతంగా ప్రచారం జరగడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎక్కడ చూసినా, ఎవరు మాట్లాడినా ఒకే విషయం పదేపదే వినిపిస్తున్న సందర్భాల్లో దీన్ని ప్రయోగిస్తుంటారు. 'అతని పేరిప్పుడు మోత మోగిపోతోంది' అనే లాంటి ప్రయోగాలు ఉన్నాయి.
 
 
==వీధిన పడడం==
అసహాయ స్థితికి చేరడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అయిన వాళ్ళను, ఇల్లూ వాకిలిని అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత ఏదీ లేదనుకున్నప్పుడు వీధిలోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి దుర్భర అసహాయ స్థితి ప్రాప్తించిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఉద్యోగం పోవడంతో కుటుంబంతో సహా వాడు వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చింది' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయం తరచుగా వినిపిస్తుంది.
==ఉరి పెట్టడం==
బాధ పెట్టడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఉరితీత ఎంతటి మరణ యాతన కలిగిస్తుందో అంతటి బాధ అనేది దీని అర్థం. నిజంగా ఉరి తీసినా, తీయక పోయినా అంతటి బాధను అనుభవించి కుమిలి పోయేలా ఎవరైనా ప్రవర్తించినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'వారన్న మాటలు నీతి నిజాయితీలతో ప్రవర్తించే అతడికి ఉరి పెట్టినంత బాధను కలిగించాయి' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
==వంపున మరదలు==
ఇది తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో వినిపించే జాతీయం. వంపున అనే పదానికి ఏకాంతం, లోపల, ఒంటరిగా అనే అర్థాలు ఉన్నాయి. స్థూలంగా ఈ జాతీయానికి ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే బాహ్యప్రపంచంలో ఒక రకంగాను, ఎవరూ లేనప్పుడు మరోరకంగాను దుర్మార్గ భావంతో ప్రవర్తించడమనే అర్థం ఉంది. పరస్త్రీని పదిమంది ముందూ సోదరిగా పిలుస్తూ, అలా భావిస్తున్నట్టు నటిస్తూ ఆమె ఏకాంతంగా దొరికినప్పుడు దుర్భుద్ధితో ఏ వ్యక్త్తెనా ప్రవర్తిస్తే ఈ జాతీయంతో సూచించడం కనిపిస్తుంది. 'వాడి పద్ధతే మంచిది కాదు. వంపున మరదలన్న తీరున ఉంటాడు జాగ్రత్త' అనే ప్రయోగాలున్నాయి.
==రంపపు కోత==
తీవ్రమైన బాధ అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. రంపంతో దుంగలను కోసేటప్పుడు ఒక్కసారిగా దుంగ తెగి పడక చాలాసేపు పదునైన రంపపు పళ్లు కోతకు గురవుతుంటాయి. ఆ స్థితి మానవ శరీరానికి కలిగితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ భావం ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా మరొకరిని తీవ్రంగా బాధిస్తున్నప్పుడు 'వాడు చేసిన అవమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు రంపపు కోతకు గురవుతుంటుంది' అనే లాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
==హారతి కర్పూరం అయిపోవడం==
సులభంగా ఖర్చైపోవడం, తొందరగా అయిపోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కర్పూరాన్ని హారతి కోసం వెలిగించినప్పుడు కలిగే స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ధనం, ఆస్తి తొందరగా ఖర్చైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఆస్తంతా హారతి కర్పూరమైంది' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.
==నింగెత్తు==
నింగి అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం అంత ఎత్తు అని అతిశయోక్తిలాగ చెప్పటం ఈ జాతీయం వెనుక ఉన్న పరమార్థం. ఎంతో ఎక్కువ, చాలా పెద్ద అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో నింగెత్తు వాగ్దానాలు చేస్తారనేగానీ అందులో ఒక్కటీ నెరవేర్చరు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం గమనార్హం.
==నోరుబెల్లం==
తెలంగాణా ప్రాంతంలో విస్తృతంగా వినిపించే జాతీయమిది. ఇతర ప్రాంతాల్లో అయితే నోరు తీపి అనేలా కూడా వినిపిస్తుంది. దీనికి అర్థం తీయటి మాటలు చెప్పడం అంటే మనసుకు నచ్చేవిధంగా మాట్లాడడం అని అర్థం. మంచిగా మాట్లాడి తన పని తాను చేసుకుపోవడం, ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడడం అనే అర్థాలు ఈ జాతీయం వెనుక ఉన్నాయి. ఇలా తియ్యతియ్యగా మాట్లాడేవారు ఆ మంచితనాన్ని మాటలవరకు మాత్రమే పరిమితం చేసి చేతల్లో ఏమీచెయ్యని సందర్భాల్లో 'ఎప్పుడు పోయినా నోరు బెల్లమే తప్ప ఆయన నయాపైసా ఇచ్చింది లేదు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం గమనార్హం.
==కడుపులో చల్ల కదలకుండా==
ఏమాత్రం శ్రమ లేకుండా... అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అంటే కూర్చున్నవారు కూర్చున్నచోటనే ఉండి శారీరకంగా రవ్వంత కూడా అటూఇటూ కదలకపోయినా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకోగలగడం. 'వాడు సామాన్యుడు కాడు. కడుపులో చల్ల కదలకుండా ఎంతటి పనినైనా సాధించగలడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==అడవి మృగాల్లాగ==
విచక్షణా రహితంగా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అడవిలో ఉండే జంతుజాలానికి మనిషికి ఉన్నట్టు విచక్షణ అనేది ఉండదు. జంతువు ఎలాపడితే అలా ప్రవర్తిస్తుంటుంది. ఆ మృగాల్లాగ ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు 'ఎందుకలా అడవి మృగాల్లాగ ప్రవర్తిస్తారు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
==వియ్యాలవారి కయ్యాలు==
మిత్రపక్షాలవారి మధ్య వచ్చే తగాదా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వివాహాల సందర్భంలో వధువు పక్షంవారు, వరునిపక్షం వారు సంబంధం కలిసి వియ్యాలవారైనప్పుడు కొంత సరదా కోసం చిలిపి తగాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పద్ధతిలోనే ఎక్కడైనా పోట్లాటలు, తగాదాలు సంభవించినప్పుడు వాటిని ఈ జాతీయంతో పోల్చిచెప్పడం కనిపిస్తుంది. 'ఆ గొడవలను అంతగా పట్టించుకోవల్సిన పనిలేదు. అవి వియ్యాలవారి కయ్యాలు మాత్రమే' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
Line 501 ⟶ 457:
==కుండమీదికి==
వంట సరుకులు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కుండమీదికి, కుండ కిందికి, పొయ్యి మీదికి, పొయ్యి కిందకి... అనే లాంటి సమానార్ధక ప్రయోగాలు ప్రచారంలో ఉన్నాయి. అంటే పొయ్యి పెట్టి వంట చేసేటప్పుడు పూర్వం పొయ్యిలోకి కట్టెలను వాడేవారు. పొయ్యి మీదికి (కుండమీదికి) అంటే కుండలో ఏదైనా వండడానికి సరుకులు అవసరం. ఈ భావనతోనే 'ఈ రోజు కుండమీదికేముంది' అని ఎవరైనా అంటే వండడానికి సరుకులేమున్నాయనేది దాని అర్ధం. అలాగే 'కుండమీదికి, కుండ కిందికి ఉండేటట్లు ఈ జీవితం సాగిపోతే చాలు' అనే లాంటి ప్రయోగాలు కూడా వినిపిస్తుంటాయి.
==సంకెళ్లుతెగడం==
అడ్డంకులు తొలగడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎంత బలవంతుడికైనా సంకెళ్లు వేస్తే ముందుకు నడవడానికి వీలు కుదరదు. అలాగే ఏదో ఒక కారణంతో చేసే పనికి ఎవరైనా అడ్డంకులు కల్పిస్తున్నప్పుడు ముందుకు సాగడం జరగదు. ఆ అడ్డంకులు తొలగినప్పుడు 'ఇన్నాళ్లూ నన్ను ఇబ్బంది పెట్టిన సంకెళ్లన్నీ తొలగిపోయాయి. ఇక నా పని నేను సులభంగా చేసుకుపోతాను' అనే లాంటి ప్రయోగాలు వినిపిస్తుంటాయి.
==ఏనుగు దాహం==
పేరాశ, అత్యాశ అనే అర్ధాలలో ఈ జాతీయాన్ని వాడతారు. జంతులోకంలో ఏనుగుకు ఉన్న స్థానాన్ని, దాని భారీ ఆకారతత్వాలను దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. అలాగే ఏనుగుదాహం తీరటానికి తీసుకొనే నీటి పరిమాణాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవడమే ఈ జాతీయ ఆవిర్భావానికి ఓ కారణం. మనిషికి దాహమైతే ఓ గ్లాసో, రెండు గ్లాసులో సరిపోతాయి. సాధారణ పక్షులు, జంతువులైతే కొద్ది ప్రమాణంలోనే నీటినీ తాగుతుంటాయి. ఒంటె లాంటి జంతువులు తాగినంత నీరు తాగి కొంత తమలో అవసరానికి దాచుకుంటాయి. ఇలా జంతువుల, పక్షుల, మనుషుల తత్వాలను గమనిస్తూ వచ్చిన మనిషి తన పరిశీలన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని వాటితత్వాలను ఇతరులతో సరిపోల్చి చెప్పుకునేందుకు ఇలాంటి జాతీయాలను వాడుకలోకి తెచ్చుకొన్నట్లు అవగతమవుతుంది. 'ఏనుగు దాహంతో ఆ దుర్మార్గానికి పాల్పడి అవమానాలు పాలయ్యాడు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు