జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
 
==వియ్యాలవారి కయ్యాలు==
 
మిత్రపక్షాలవారి మధ్య వచ్చే తగాదా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వివాహాల సందర్భంలో వధువు పక్షంవారు, వరునిపక్షం వారు సంబంధం కలిసి వియ్యాలవారైనప్పుడు కొంత సరదా కోసం చిలిపి తగాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పద్ధతిలోనే ఎక్కడైనా పోట్లాటలు, తగాదాలు సంభవించినప్పుడు వాటిని ఈ జాతీయంతో పోల్చిచెప్పడం కనిపిస్తుంది. 'ఆ గొడవలను అంతగా పట్టించుకోవల్సిన పనిలేదు. అవి వియ్యాలవారి కయ్యాలు మాత్రమే' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
 
==ఉరుకులు పరుగుల మీద==
 
అత్యంత శీఘ్రంగా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శీఘ్ర గమనాన్ని ఉరుకులు, పరుగులు అనడం తెలిసిందే. ఏ పనినైనా చెప్పిన వెంటనే చేసిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఆయన నోటి నుంచి మాట వచ్చిందో లేదో ఉరుకులు పరుగుల మీద వెళ్లి ఆ పని చేసుకొచ్చారు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==ముల్లుకర్రతో పొడవడం==
నిరంతరం గుర్తుచేస్తూ ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. రైతు ఎద్దులను ముందుకు నడవమని హెచ్చరిక చేయడానికి ముల్లుకర్రతో పొడుస్తుంటాడు. ఎద్దు నడక ఆపినప్పుడల్లా అలా పొడవడం జరుగుతుంది. ఈ భావన ఆధారంగా ఎవరైనా చేయాల్సిన పనిని పక్కనపెట్టి స్తబ్దంగా ఉన్నప్పుడు, వారికి పనిచేయాల్సిన విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేయాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగిస్తుంటారు. 'వెంబడి పడి ముల్లుకర్రతో పొడుస్తుంటే తప్ప వాడు పనిచేయడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==కత్తులు నూరటం==
కక్షతో బలాబలాలను ప్రదర్శించుకోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కత్తి మారణాయుధం. శత్రువుమీద దాడిచేసి అతని
అంతాన్ని చూడటానికి అదో సాధనమవుతుంది. దాన్ని నూరటం అంటే పదును పెట్టడం అని అర్థం. జాతీయ ప్రయోగం విషయంలో నిజంగా
కత్తి నూరినా, నూరకపోయినా తన శత్రువుమీద కక్ష సాధించటానికి ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఈ జాతీయంతో సరిపోల్చి చెపుతుంటారు.
"పాలకపక్షం మీద విపక్షం కత్తులు నూరుతోంది" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం విన్పిస్తుంది.
==స్వస్తి పలకడం==
ముగింపు చెప్పడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సంప్రదాయకంగా ఏ పనైనా ముగించేటప్పుడు స్వస్తివాచకం చెప్పడం జరుగుతుంది. దాని ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'చదువులకు స్వస్తి చెప్పి వారంతా ఉద్యమంలోకి నడిచారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం తరచుగా వినిపిస్తుంది.
==పలుచన కావడం==
గౌరవం నశించడం, సిగ్గుపోవడం లాంటి అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పలుచనితనం శక్తిహీనతకు గుర్తు. శక్తి లేనప్పుడు గౌరవహాని, అవమానాలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'కానిపని చేసి నలుగురిలోను పలుచన కావద్దు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది.
==దారిన పడటం==
దుర్మార్గం నుంచి సన్మార్గంలోకి నడవం, కష్టాల నుంచి సుఖాలవైపు సాగటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అడ్డదిడ్డంగా ఉన్న దోవన నడవటం ఎవరికైనా బాధకలిగించే విషయమే. అదేచక్కగా తీర్చిదిద్దినట్టున్న దారిన నడవటమంటే అందరికీ ఆనందం కలిగే విషయమే. ఈ నేపథ్యం నుంచే ఈ జాతీయం ఆవిర్భవించింది. "వాడికి ఆ ఉద్యోగం వచ్చాకే జీవితం కాస్త దారిన పడ్డట్టయింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం గమనించవచ్చు.
==మెడ నెట్టించుకోవడం==
బహిష్కార శిక్షను అనుభవించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరిమీదైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు వారిని అవతలికి బలవంతంగా పంపించాలనుకున్నప్పుడు మెడమీద చెయ్యిపెట్టి నెట్టడం జరుగుతుంటుంది. వాస్తవంగా ఇలా జరిగినా జరగకపోయినా ఇష్టంలేని వారిని ఎదుటినుంచి వెళ్లిపొమ్మని గట్టిగా అరచిన సందర్భాలలో కూడా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'సభలో అనవసరంగా గొడవ చేసి మెడపట్టి నెట్టించుకునేదాకా తెచ్చుకున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఇది వినిపిస్తుంది.
==దొంగకు తోవ చూపడం==
తెలిసో తెలియకో శత్రువుకు మేలు కలిగేలా చేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పూర్వం ఎప్పుడో జరిగిన ఓ సంఘటనను ఈ జాతీయ ఆవిర్భావానికి పునాదిగా చెపుతుంటారు. ఒకసారి ఒక దొంగ ఓ ఇంట్లో చొరబడ్డాడట. అయితే కొంతమంది ఆ దొంగను చూశారు. దొంగ పారిపోవడానికి ఆ ఇంటి కప్పు పైకి ఎగబాకాడు. ఆ దొంగను పట్టుకోవాలని కొంత మంది పరుగు పెడుతుంటే వారిలోని ఒకడు... అలా పరుగెత్తకండి, దొంగ ఇంటికప్పుమీద ఉన్న పెంకులతో కొట్టగలడు సుమా! అని హెచ్చరించాడట. దొంగకు అప్పటిదాకా తనను పట్టుకోబోయే వారిపైకి పెంకులను విసిరికొట్టి తప్పించుకోవాలనే ఆలోచన కలగలేదు. జనంలో నుంచి వినిపించిన మాటతో ఆ దొంగకు పెంకులతో తిరగబడాలన్న ఆలోచన కలిగి అలానే చేశాడట. ఇదేవిధంగా కొంత మంది సమయం, సందర్భం తెలియకుండా ప్రవర్తిస్తూ తమ శత్రువులకు ఉపయోగం కలిగేలా చేస్తుంటారు. అలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==చొప్ప తినే ఎద్దులా==
విరామం లేకుండా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వ్యవసాయం జీవనాధారంగా ఉన్న సమాజ నేపథ్యం నుంచి ఇది అవతరించింది. చొప్ప తినే ఎద్దు మేస్తున్నంతసేపు విరామం లేకుండా మేస్తూనే ఉంటుంది. అలాగే ఎవరైనా నిరంతరం ఏదో ఒకటి నములుతూ ఉన్నా, లేక ఏదో ఒక పని నిర్విరామంగా చేస్తున్న సందర్భాల్లో కూడా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఎప్పుడూ చొప్పతినే ఎద్దులా ఏమిటలా ఏదో ఒకటి నములుతూనే ఉంటావు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడం గమనార్హం.
==దొంగోకాడ - చీకటోకాడ==
నేర్పరితనం లేని పని అనే అర్థంలో ఈ జాతీయం తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోగంలో ఉంది. ఇది పూర్వ కాలం నాటిసామాజిక పరిస్థితుల నేపథ్యానికి ప్రతిబింబం. పూర్వం ఇప్పటిలాగా కాక దొంగతనాలనేవి కేవలం చీకటి సమయాల్లో మాత్రమే జరుగుతుండేవి.చీకటి ఉన్నప్పుడే ఎవరికీ తెలియకుండా, కనపడకుండా దొంగతనం చేయటానికి దొంగకు వీలుంటుంది. ఈ విషయం తెలియని అంటేదొంగతనంలో నేర్పరితనం లేని దొంగ చీకటి లేని సమయంలో దొంగతనానికి పాల్పడి పట్టుబడ్డాడట. చీకటి ఒకచోట దొంగ ఒకచోట ఉంటే దొంగకు ఇబ్బందే మరి. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. "దొంగోకాడ, చీకటోకాడ అన్నట్టు చేస్తే పనెట్టవుతది" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం గమనార్హం.
==కట్టె, కొట్టె, తెచ్చె==
క్లుప్తతను సూచించేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇది రామాయణ కథనంతటినీ క్లుప్తీకరించి చెప్పిన జాతీయం. రాముడు వారధి కట్టి, రావణుడిని కొట్టి, సీతమ్మను తెచ్చాడు అని రామాయణ కథనంతటినీ అత్యంత సంగ్రహంగా చెప్పినట్టుగా ఏ విషయాన్నైనా అత్యంత సూక్ష్మంగా చెప్పిన సందర్భంలో ఈ జాతీయం వినిపిస్తుంది. 'అంతపెద్ద విషయాన్ని కట్టె, కొట్టె, తెచ్చే అన్నట్టు చెప్పినా కూడా బాగానే ఉంది' అనేలాంటి సందర్భాల్లో దీన్ని గమనించవచ్చు.
==కుంచం తప్పదు==
ఇది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే జాతీయం. ఆచార వ్యవహారాలు, లావాదేవీల నేపథ్యం నుంచి ఇది అవతరించింది. 'కంచాల పోసింది తప్పుతుంది గానీ, కుంచాల పోసింది తప్పదు' అనే ఓ సామెత దీనికి ఆధారం. అంటే ఎవరినైనా పిలిచి కంచం పెట్టి అందులో అన్నం పెట్టి తినమన్నప్పుడు ఆ అన్నానికి ఖరీదు కట్టడం కానీ, మరెలాంటి వ్యాపార సంబంధమైన విషయాలుకానీ మిత్ర బంధువర్గాల్లో ఉండనే ఉండవు. కంచంలో ఎంత పెట్టినా తిరిగి తనకు ఇవ్వమని ఎవరూ అడగరు. కానీ కుంచం అంటే కొలమానం. ఏవైనా ఆహారపదార్థాలను ఓ కొలతగా కొలిచి వేరొక వ్యక్తికి ఇవ్వడమంటే దాన్ని మళ్లీ తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వాల్సిందేనని అర్థం. 'నేనిచ్చింది జాగ్రత్తగా తిరిగియ్యాల. కుంచం తప్పదు మరి' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
==కాకి బలగం==
సామూహిక ఐకమత్యానికి ప్రతీకగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. సర్వసాధారణంగా కాకులు ఆహారం దొరికినా, ఏదైనా ఆపద వచ్చినా తోటి కాకులన్నింటినీ చేరబిలిచి సామూహికంగా ఆ ఆహారాన్ని పంచుకోవటమూ, ఆపదను తెచ్చినవారిని ఎదుర్కోవడమూ చేస్తుంటాయి. ఈ పద్ధతిలోనే ఎవరైనా కొంతమంది అన్ని వ్యవహారాలను సామూహికంగా చక్కపెట్టుకుంటున్న సందర్భంలో 'వారిదంతా కాకి బలగం. ఒకరికి చెబితే చాలు అందరికీ చెప్పినట్లే. అందరూ వచ్చేస్తారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.
==తూటాలు పేల్చడం==
గొడవలు సృష్టించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తుపాకీ తూటా గురి చూసి పేల్చినప్పుడు విధ్వంసం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని గొడవలు సృష్టించినప్పుడు ఈ జాతీయం తరచుగా వినిపిస్తుంది. 'నిన్న వాడొచ్చి తూటాలను పేల్చినప్పటి నుంచి ఇలా నాశనం అయిపోయింది' అనే లాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
==ఇసుక పాతర==
పరిశోధించిన కొద్దీ ఇంకా ఇంకా విషయాలు బయట పడడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని ఎంతసేపు చేసినా అయిపోకుండా ఉండడం లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఇసుక నేలలో గుంట తీసే(పాతర) సమయంలో ఎంత ఇసుకను తీసి పక్కకు పోస్తున్నా పైనుంచి మరింత ఇసుక జారి ఆ ఇసుక పాతరలో పడి పని తొందరగా తెమలదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. 'ఈ పేపర్లు దిద్దడం నావల్ల కావడం లేదు. ఇసుక పాతర్లా దిద్దిన కొద్దీ ఇంకా ఉంటూనే ఉన్నాయ'నే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.
==అరణ్యవాసం==
కష్టాలపాలు కావటం, సమాజానికి దూరంగా ఉండటంలాంటి అర్థాలలో ఈ జాతీయాన్ని వాడతారు. సాధారణంగా జనావాసాలైన పల్లెలు, నగరాల్లోకన్నా అరణ్యాల్లో ఉంటే క్రూరజంతువుల వల్ల కలిగే బాధలు అనేకం ఉంటాయి. ఇలాంటి బాధలు కలుగుతాయన్న భావన తలెత్తిన సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'ఊరికి దూరంగా ఉన్న ఈ కార్యాలయంలో పనిచేయటం అరణ్యవాసంలానే ఉంది' అనేలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు.
 
==చూసిరమ్మంటే కాల్చొచ్చినట్టు==
Line 247 ⟶ 218:
==లెక్కతీరిపోవడం==
మరణించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'నిన్న రాత్రితో ఈ లోకానికి, ఆయనకు లెక్క తీరిపోయింది' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==పిల్లిలా==
ఎవరికీ తెలియకుండా నక్కినక్కి వెళ్లడం, మితిమీరిన అణకువతో భయపడుతున్నట్లు ఉండటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పిల్లి స్వభావంలా ఎవరైనా ప్రవర్తించిన సందర్భాల్లోనూ దీన్ని ఉపయోగించడం గమనార్హం. 'ఏదైనా పనిచెబుతామని వాడు పిల్లిలా మెల్లగా జారుకున్నాడు. ఆయన ముందు వాడు పిల్లిలా ఒదిగి ఉంటాడు తప్ప ఏమాత్రం ఎదురుతిరగడు' అనే సందర్భాల్లో వాడుతుంటారు.
==భజన చేయించుకోవడం==
బాగా పొగిడించుకోవడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. భగవంతుడి పేరున చేసే భజనలలో ఆ భగవానుడి విశిష్ట లక్షణాలను అన్నిటినీ వివరిస్తూ కీర్తించడం కనిపిస్తుంది. అదే పద్ధతిలో అతిశయోక్తులను చేర్చి ఉన్నవీ లేనివీ అన్నీ కల్పించి తనపక్షం వారిచేత మరొకరిముందు ఎవరైనా పొగిడించుకుంటూ ఉన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. "నిన్నటి సభా కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేసుకున్న వక్తలతో ఆయన తనను తెగ భజన చేయించుకున్నాడు. అంతేకానీ అంత గొప్పవాడేమీకాదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==నాలుగ్గోడల మధ్య==
పరిమిత ప్రదేశంలో, ఇంటిలో అనే అర్ధాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎప్పుడూ బయటికి రాకుండా కొన్ని పరిమితులు, పరిధులు ఏర్పాటు చేసుకొని ఉండేవారి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "ఇంతకాలం నాలుగ్గోడల మధ్య ఉన్న వ్యక్తి కావటంతో బయటి ప్రపంచం అసలు తెలియకుండా పోయింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
Line 268 ⟶ 235:
==కబంధ హస్తాలలో చిక్కడం==
తప్పించుకోలేని విషమ పరిస్థితులు ఏర్పడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. రామాయణంలో కబంధుడి ప్రస్తావన ఉంది. కబంధుడి చేతులలో చిక్కినవారెవరూ బతికి బయటపడడం నాడు సాధ్యమయ్యేదికాదు. అంత క్లిష్ట పరిస్థితులు వచ్చాయని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.
==ఆకాశ, పాతాళాల వ్యత్యాసం==
అత్యధికంగా తేడా ఉంది అని చెప్పదలుచుకున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఆకాశం ఎక్కడో అంత ఎత్తున ఉంటుంది. పాతాళం కింద ఎక్కడో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉండే దూరాన్ని కచ్చితంగా కొలిచి చెప్పడం ఎంత కష్టమో అలాగే ఏవైనా రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు 'వాడితో వీడికి పోలికేంటి, ఆ ఇద్దరి మధ్య ఆకాశ, పాతాళాల వ్యత్యాసం ఉందని గుర్తించండి' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.
==ఆగ్నేయాస్త్రం ఎక్కుపెట్టడం==
తీవ్రమైన ముప్పు కలిగించబోవడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనకు పురాణాలలో కనిపించే ఆగ్నేయాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం ఆవిర్భవించింది. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే శత్రువు మంటల్లో మాడి మసైపోవలసిందే. అలాగే ఎవరైనా ఏ పనికైనా ముప్పు కలిగించాలనుకొంటున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగించడం గమనించవచ్చు.
==అబ్బసొమ్ము==
వంశపారంపర్యంగా సంక్రమించే ఆస్తి అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఇది ఎక్కువగా పరుషంగా మాట్లాడే సందర్భాల్లో వినిపించడం విశేషం. "ఈ దేశం ఎవడబ్బ సొమ్మూ కాదు, అందరికీ ఇక్కడ బతికే హక్కు ఉంది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.
==రయ్‌మని వెళ్ళటం==
తెలుగు భాషలో కొన్ని జాతీయాలు అనుకరణ శబ్దాల నుంచి ఆవిర్భవించాయని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. రయ్‌మని వెళ్ళటమంటే అమిత వేగంగా వెళ్ళటమనేది అర్ధం. బాగా వేగంగా కదిలేటప్పుడు వచ్చే శబ్దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జాతీయం వచ్చింది. అయితే... ఇది ప్రయోగంలో సాధారణంగా వేగంగా వెళ్ళటాన్ని సూచించినా అభివృద్ధి బాగా జరుగుతోంది అని చెప్పే సందర్భాల్లో కూడా ఇది ప్రయోగంలో కనుపిస్తుంది. సైకిల్‌మీద రయ్‌మని దూసుకువెళుతున్నాడు, వ్యాపారంలో రయ్‌మని ముందుకు వెళుతున్నాడు అనేలాంటి సందర్భాలు ఈ జాతీయ ప్రయోగానికి ఉదాహరణలుగా కనుపిస్తున్నాయి.
Line 418 ⟶ 379:
==కొంగు ముడేయడం==
వివాహం జరిపించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'పల్లూ బాంధ్‌నా' అని దీనికి సామ్యంగా హిందీ భాషలో కూడా జాతీయం ఉంది. సంప్రదాయబద్ధంగా ఉన్న కొన్ని విషయాలు జాతీయాలయ్యాయి అనడానికి ఇదొక ఉదాహరణ. వధూవరుల కొంగులను వివాహ సమయంలో ముడివేయడం ఓ సంప్రదాయం. 'ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ కొంగుముడేయాలని అనుకుంటున్నాం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
==ఆకాశానికెత్తటం==
అతిగా పొగడటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అలంకారాలలో అతిశయోక్తి అలంకారం ఒకటుంది. దానికి ఉదాహరణగా నగరంలోని సౌధాగ్రాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెబుతారు. ఎంత ఎత్తుకట్టినా సౌధాలు ఆకాశాన్ని తాకటం అనేది జరిగే పనికాదు. అంటే ఇక్కడ విషయాన్ని అతిగా వర్ణించి చెప్పడం కనిపిస్తుంది. ఇలాంటిదే ఈ జాతీయం కూడా. గోరంతలను కొండంతలు చేసి ఎవరినైనా అతిగా పొగడుతున్నప్పుడు 'మరీ అంతగా ఆకాశానికెత్తొద్దులే' అనే లాంటి ప్రయోగం కనిపిస్తుంది.
==వూపిరి పీల్చుకోవడం==
వూరట చెందడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శ్వాస సక్రమంగా ఆడుతున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో అలా వూపిరి ఆడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏ పనినైనా చేస్తున్నప్పుడు, చేసిన తరువాత ఇలాంటి ఆనందాన్ని పొందిన సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'ఇందాకటి దాకా వూపిరిపీల్చుకోవడానికి కూడా వీలు లేనంతగా పనిలో మునిగిపోయి ఇబ్బందిపడ్డాను. ఇప్పుడే కాస్త వూపిరి పీల్చుకుంటున్నాను' అనేలాంటి ప్రయోగాలున్నాయి.
==వీరవిహారం చేయడం==
విజయాలను ఎదురులేకుండా సొంతం చేసుకోవడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వీరుడు శత్రువులను జయిస్తూ ఆనందంగా ఎలా ముందుకు వెళతాడో అలాగే ఎవరైనా వెళ్ళిన ప్రతిచోటా విజయాలను సాధిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. ఎక్కువగా పరీక్షలు, క్రీడల వంటి వాటిలో విజయం పొందుతున్నప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. 'ఈసారి జరిగిన క్రీడా పోటీలలో ఆ జట్టు వీర విహారం చేసింది' లాంటి ప్రయోగాలున్నాయి.
 
==మంటకలపడం==
నాశనం చేయడం అనే అర్ధంలో ఈ జాతీయంవాడుకలో ఉంది. ఏ వస్తువైనా అగ్నిలో దగ్ధమైన తరువాత ఇక దాని రూపమనేది ఉండదు. ఇలా
దేనినైనా నశింపజేయగల శక్తి అగ్నికుంది. అయితే ఇది జాతీయంగా వాడినప్పుడు నీతి నియమాల వంటివి, మంచితనం లాంటివి నాశనమైన
సందర్భాలను సూచిస్తుంది. 'ఆ పాడు పని చేసి నీతి నియమాలను మంటకలిపాడు. అలాంటి వాడితో స్నేహమేమిటి' అనేలాంటి ప్రయోగాలు
కనిపిస్తాయి.
==మరతుపాకీ తూటా==
వెనువెంటనే అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనిషి కళ్లెదుట కనిపించే అనేక వస్తువులు, పరికరాలు, ఆయుధాల వంటివి కూడా
జాతీయాల ఆవిర్భావానికి నిరంతరం ఆధారాలవుతూనే ఉన్నాయన్న సత్యానికి ఇదొక ఉదాహరణ. మరతుపాకిని పేల్చితే దాని తూటా వెనువెంటనే ఎంత వేగంగా బయటకు వెళుతుందో అంతటి వేగమని చెప్పడానికి దీన్ని ప్రయోగిస్తుంటారు. 'మాట అనీ అనగానే పేలిన మరతుపాకీ తూటాలా వెళ్ళిపోయి ఆ పని చేశాడు' అనే లాంటి సందర్భాలలో దీని ప్రయోగం ఉంది.
==చల్లని సంసారం==
ప్రశాంతమైన కుటుంబ జీవన విధానం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చల్లదనం ఆనందానికి, ఆహ్లాదానికి ప్రతీకగా గ్రహిస్తున్న నేపథ్యంలో ఈ జాతీయం ఆవిర్భవించింది. ఎవరి కుటుంబమైనా ఏ గొడవలూ లేకుండా హాయిగా గడిచిపోతున్నప్పుడు 'వాళ్ళకేమండీ... వాళ్ళది చల్లని సంసారం' అని అనడం గమనార్హం.
==తలదించుకోవటం==
అవమానం పొందటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తప్పుచేసి దొరికినప్పుడు శిక్షను అనుభవించేటప్పుడు ఎవరైనా అవమానంతో తలదించుకోవటం జరుగుతుంది. చాలా సహజంగా దేహపరంగా జరిగే ప్రతిస్పందనలలో ఇది కూడా ఒకటి. ఈ కారణంగా అవమానకరం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. 'తప్పు చేయటమెందుకు అలా తలదించుకోవటమెందుకు.... నిజాయితీగా ఉంటే బాగుండేది కదా..' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.
==చతుర్ముఖ పారాయణం==
చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలిగిన వాడు అంటే బ్రహ్మదేవుడు అనే అర్ధం బహుళ ప్రచారంలో ఉంది. ఈ జాతీయం విషయానికి వస్తే ఆ బ్రహ్మదేవుడి నామాన్ని పారాయణ చేయడమో, పూజలో, వ్రతాలో చేయడమన్నది మాత్రం దీని అర్ధం కాదు.పేకాట అనే దీని అర్ధం. పేక ముక్క దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. దీని నాలుగు మూలల అంచులను నాలుగు ముఖాలుగా చెప్పి దాన్ని చతుర్ముఖం అని పిలుస్తూ ఆ పేకముక్కలతో ఆడే ఆటను చతుర్మఖ పారాయణం అనడం జరుగుతోంది. 'ఈ సమయంలో వాడు ఇంటిదగ్గర ఉండడు. బయట ఎక్కడో చతుర్ముఖ పారాయణ చేస్తుంటాడు' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==పొగచూరడం==
నాణ్యత తగ్గడం, స్థాయి దిగజారడం అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏ వస్తువైనా పరిశుభ్రంగా ఉన్నప్పుడు దాని విలువ, స్థాయి ఎక్కువగా ఉంటాయి. అలాకాక దుమ్ముపడి ఉండడమో, మురికిగా కనిపించడమో, లేదంటే పొగపట్టి ఉండడమో జరిగితే ఆ వస్తువుకు అంతగా విలువ ఉండదు. వ్యక్తిత్వ విషయానికి దీన్ని ఆపాదించి జాతీయంగా చెప్పుకోవడం కనిపిస్తుంది. స్వార్ధం లాంటి చెడు గుణాలతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వం పొగచూరిన వస్తువులా విలువ తగ్గి ఉంటుందన్నది భావన. 'ఆయన ఇన్నాల్టి మనిషి కాదు. పొగచూరిన మనస్తత్వంతో ప్రవరిస్తున్నాడాయన' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.
==మింగుడుపడడం==
అనుకూలంగా ఉండడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఆహారం ఏదైనా మింగుడుపడ్డప్పుడే లోపలికి వెళ్ళి జీర్ణం కావడం, దాని రుచిని ఆస్వాదించగలగడం, తిన్న సంతృప్తి మిగలడం అనేవి జరుగుతాయి. శారీరక పరిస్థితి, తినడానికి తీసుకున్న ఆహారపు స్థితి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ఆ పదార్ధాన్ని నమిలి మింగడం అనేది జరుగుతుంది. ఇలా జరగడమంటే పరిస్థితి అంతా అనుకూలంగా ఉన్నదని అర్ధం. ఈ భావన ఆధారంగా పరిస్థితి అనుకూలంగా ఉండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 'అంతటి పరిస్థితి కూడా వాడికి సులభం గానే మింగుడు పడింది' అని , వ్యతిరేకార్ధంలో చెప్పేటప్పుడు ప్రతిపక్షం ఆందోళన పాలక పక్షం వారికి మింగుడు పడడం లేదు' అనే లాంటి సందర్భాలలోనూ ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.
==మండిపడటం==
ఆగ్రహించటం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఆగ్రహాన్ని అగ్నితో పోల్చి చెప్పటం వల్ల ఇది ప్రచారంలోకి వచ్చింది. మంటలు ఎగసినప్పుడు ఎదుటి వారికి ఎంతటి భయం కలుగుతుందో ఒక వ్యక్తిలో కోపం కూడా అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు ఎదుటివారు భయపడతారు. ఇలాంటి భావసారూప్యం ఈ జాతీయం వెనుక ఉంది. 'కొత్తచట్టం వచ్చినందుకు కార్మికులు ఆనందంగానే ఉన్నా యాజమానులు మాత్రం మండి పడుతున్నారు' అనే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
==మాడు పగలగొట్టడం==
విపరీతంగా బాధించటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నెత్తిమధ్యలో ఉండే మెత్తటి ప్రదేశాన్ని మాడు అని అంటారు. చిన్నప్పుడది ఎంతో సున్నితంగా ఉండి తరువాత గట్టిపడుతుంది. ఆ ప్రదేశంలో దెబ్బతగిలితే కలిగే బాధ అంతా ఇంతా కాదు. అలాంటి బాధను పోలిన బాధ అని చెప్పటానికి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. వాస్తవంగా మాడు పగలగొట్టినా.. కొట్టకపోయినా ఆ స్థాయిలో బాధ ఉన్నప్పుడు 'వాడన్న మాటలతో మాడు పగిలినట్టయింది' అనే లాంటి సందర్భాలున్నాయి.
==ఆవంత==
అత్యల్పం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొంచెం అని చెప్పటానికి దీన్ని ప్రయోగిస్తుంటారు. ఇక్కడ ఆవు.., అంత.. అనే పదాలు కలవటం జరిగింది, అంటే ఆవగింజ అని అర్ధం. ప్రమాణంలో ఆవగింజ చాలా చిన్నది. అంతకొద్దిపాటిది అని చెప్పడానికి 'ఆవగింజంత పని కూడా నీవల్ల కాలేకపోయింది' అనే లాంటి సందర్భాలలో దీని ప్రయోగిస్తుంటారు.
==లేనిపోని తలనొప్పి==
అనవసర ఇబ్బందులు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని ఎవరు అనుభవిస్తుంటే వారికి ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ వల్ల చేయాల్సిన ఇతర పనులేవీ సక్రమంగా జరుగవు. అలాంటి తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఎందుకంటే జరగాల్సిన పనులు జరుగవు కనుక. ఇక్కడ తలనొప్పి అనేది లక్ష్యసాధనకు అవరోధమన్నది భావంగా తీసుకోవడం వల్ల ఇదొక జాతీయమైంది. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. మనతోపాటు వాణ్ణి తీసుకువెళ్లడమంటే లేనిపోని తలనొప్పిని తెచ్చుకున్నట్టే అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
==బాట వేయడం==
అనుకూల పరిస్థితులు ఏర్పరచడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. నడక సక్రమంగా సాగి గమ్యానికి చేరాలంటే ఎత్తుపల్లాలు, ముళ్ళురాళ్ళు లేని దారి కావాలి. అలా ఓ చక్కటి బాట ఉంటే ఎలా గమ్యానికి సులభంగా చేరగలుగుతామో, ఏకార్యమైనా సిద్ధించడానికి కావలసిన అనుకూల పరిస్థితులను ఏర్పరిచిన సందర్భంలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. 'సరైన కృషి సాధనలతోనే విజయానికి బాటలు వేయగలుగుతాం' అనే లాంటి ప్రయోగాలున్నాయి.
 
==కుండమీదికి==
వంట సరుకులు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కుండమీదికి, కుండ కిందికి, పొయ్యి మీదికి, పొయ్యి కిందకి... అనే లాంటి సమానార్ధక ప్రయోగాలు ప్రచారంలో ఉన్నాయి. అంటే పొయ్యి పెట్టి వంట చేసేటప్పుడు పూర్వం పొయ్యిలోకి కట్టెలను వాడేవారు. పొయ్యి మీదికి (కుండమీదికి) అంటే కుండలో ఏదైనా వండడానికి సరుకులు అవసరం. ఈ భావనతోనే 'ఈ రోజు కుండమీదికేముంది' అని ఎవరైనా అంటే వండడానికి సరుకులేమున్నాయనేది దాని అర్ధం. అలాగే 'కుండమీదికి, కుండ కిందికి ఉండేటట్లు ఈ జీవితం సాగిపోతే చాలు' అనే లాంటి ప్రయోగాలు కూడా వినిపిస్తుంటాయి.
==ఏనుగు దాహం==
పేరాశ, అత్యాశ అనే అర్ధాలలో ఈ జాతీయాన్ని వాడతారు. జంతులోకంలో ఏనుగుకు ఉన్న స్థానాన్ని, దాని భారీ ఆకారతత్వాలను దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. అలాగే ఏనుగుదాహం తీరటానికి తీసుకొనే నీటి పరిమాణాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవడమే ఈ జాతీయ ఆవిర్భావానికి ఓ కారణం. మనిషికి దాహమైతే ఓ గ్లాసో, రెండు గ్లాసులో సరిపోతాయి. సాధారణ పక్షులు, జంతువులైతే కొద్ది ప్రమాణంలోనే నీటినీ తాగుతుంటాయి. ఒంటె లాంటి జంతువులు తాగినంత నీరు తాగి కొంత తమలో అవసరానికి దాచుకుంటాయి. ఇలా జంతువుల, పక్షుల, మనుషుల తత్వాలను గమనిస్తూ వచ్చిన మనిషి తన పరిశీలన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని వాటితత్వాలను ఇతరులతో సరిపోల్చి చెప్పుకునేందుకు ఇలాంటి జాతీయాలను వాడుకలోకి తెచ్చుకొన్నట్లు అవగతమవుతుంది. 'ఏనుగు దాహంతో ఆ దుర్మార్గానికి పాల్పడి అవమానాలు పాలయ్యాడు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
 
[[Category:తెలుగు భాష]]
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు