పక్షవాతం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
'''పక్షవాతం''' [[నాడీ వ్యవస్థ]]కు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు.శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది.ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది.ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు.మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు.కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది.దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు.పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న వరల్డ్‌ స్ట్రోక్‌ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు.అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మధ్యపానంమద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం, లేదా రెండుగా కనిపించడం, కాళ్ళూ, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటల్లో తడబాటు వంటివన్నీ పక్షవాతానికి ముందస్తు సంకేతాలు.ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు స్ట్రోక్‌ యూనిట్‌ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకురాగలిగితే వారికి త్రాంబోలైటిక్‌ థెరపీ ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించి, మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడవచ్చు.అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల 10 శాతం మంది కూడా గంటలోపు ఆసుపత్రికి రావడం లేదు.
== ముఖపక్షవాతం ==
ముఖ కండరాలకు సరఫరా చేసే ఏడవ క్రేనియల్‌ నాడీకి వచ్చే సమస్యలు (ఇన్‌ఫ్లమేషన్‌) వల్ల మూతి వంకరపోతుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో బెల్స్‌ పాల్సి అంటారు.చలికాలంలో రాత్రులు బస్సులో ప్రయాణిస్తుంటే కిటిక పక్కన కూర్చున్న వారి చెవిలోకి చలిగాలిపోయి నరంపై ఒత్తిడి తగిలి బెల్స్‌ పాల్సి వచ్చే అవకాశం ఉంది. 'హెర్పస్‌ జోస్టర్‌ వైరస్‌' ఇన్‌ఫెక్షన్‌ కొన్ని సందర్భాల్లో సమస్యగా మారొచ్చు.బెల్స్‌ పాల్సి (ముఖ పక్షవాతం)కి గురైన వారిలో ముఖంలో ఒకవైపు కండరాలు చచ్చు బడిపోతాయి. చెవి దగ్గర కొద్దిగా నొప్పి ఉంటుంది. పెదవుల చుట్టూ తిమ్మిర్లు, కళ్లు ఎండిపోయినట్లు వుండొచ్చు. నాలుక పక్కకు ఉంటుంది. కన్ను మూయలేక పోవడం వల్ల దుమ్ముపడి 'కెరిటైటిస్‌' అనే సమస్య వచ్చి కళ్ల వెంట నీరు కారుతుంది. కుడివైపు ముఖ పక్షవాతం వచ్చినవారు నవ్వినప్పుడు మూతి ఎడమవైపునకు లాగినట్లు వంకరపోయి కనిపిస్తుంది. బెలూన్‌ ఊదలేకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, దవడలో ఆహారం ఉంచుకోలేకపోవడం జరుగుతాయి. మాటలో మార్పు కనిపిస్తుంది. నుదురుమీద ముడతలు ఏర్పడవు. ఈలవేయలేరు. పెదవుల్లో కదలికలు మందగిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/పక్షవాతం" నుండి వెలికితీశారు