జలచక్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
జలచక్రంను నీటి చక్రం, హైడ్రాలిక్ చక్రం, H2O చక్రం అని కూడా అంటారు, ఈ నీటి చక్రం భూమిపై వాతావరణంలో, భూగర్భంలో మరియు భూఉపరితలంపై నీరు యొక్క నిరంతర కదలికలను గురించి వివరిస్తుంది. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ లన్నింటినికలిపి '''జలచక్రం''' అంటారు.
 
వర్షం కురిసినప్పుడు చెరువులు, కుంటలు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసిపోయి పెద్దపెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్దపెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు సముద్రాలలోకి, మహా సముద్రాలలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతుంది. వేసవి కాలంలోని అధిక వేడిమివల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జలచక్రం" నుండి వెలికితీశారు