మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Mikkilineni Radhakrishna Murthy.png|thumb|మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]]
'''మిక్కిలినేని''' గా ప్రసిద్ధులైన '''మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి''' ([[జూలై 7]], [[1916]] - [[ఫిబ్రవరి 22]], [[2011]]) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు [[గుంటూరు]] జిల్లా [[లింగాయపాలెం]] లో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై [[కపిలవాయి రామనాథశాస్త్రి]] శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. [[ప్రజానాట్యమండలి]] రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. [[ఆంధ్ర ప్రభ]]లో 400 మంది నటీనటుల జీవితాలను '[[నటరత్నాలు]]' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.