నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలములు/నూనెలు''' (vegetable oils) అందురు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి సంతృప్త మరియు అసంతృప్త కొవ్వుఆమ్లాలను కలిగి ఉంటాయి. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. సబ్బులు, కొవ్వు ఆమ్లాలు, గ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: ఆలివ్‌, మరియు [[పామాయిల్]] వంటివి.
 
* మొక్కల విత్తనముల నుండి తీయు నూనెలు: [[వేరుశెనగ]], [[నువ్వులు]], [[ఆవాలు]], పొద్దుతిరుగుడు, [[కుసుమ]], [[పత్తిగింజల నూనె]] వంటివి.
 
* చెట్ల గింజల నుండి తీయు నూనెలు: [[వేప]],[[ కానుగ]], [[ఇప్ప]], [[మామిడి]], సాల్వవంటి నూనెలు.
 
 
2. మొక్కల/చెట్ల [[ఆకులు]],[[ పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అందురు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలు గా వినియోగిస్తారు.
 
* పూల నుండి తీయునూనెలు: [[గులాబీ]], [[మల్లెలు]], జాజి వంటివి.
* పూల మొగ్గల నుండి: లవంగనూనె వంటివి.
* బెరడునుండి: దాల్చినచెక్క (cinnamon), cassia, మరియు sassafras లనుండి
* ఆకుల నుండి: నీలగిరి (Eucalyptus), దాల్చిన (cinnamon), లెమన్‌గ్రాస్‌, పెప్పెర్‌మెంట్, రోజ్‌మేరి, టి నూనెలు
* కాండం నుండి: గంధంనూనె, దేవదారు (cedar), కర్పూరం, రోజ్‌వుడ్‌ నూనెలు.
* దుంపవేర్లు: [[అల్లం]]. [[పసుపు]]
* పళ్లతొక్కలు: [[నిమ్మ]], [[బత్తాయి]], [[ద్రాక్ష]]
* వేళ్లు: వెలెరియన్ (valerian)
 
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు