ఆరుట్ల కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| year = |
}}
'''ఆరుట్ల కమలాదేవి''' నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో [[నల్గొండ జిల్లా]] మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు [[ఆరుట్ల రామచంద్రారెడ్డి]]తో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.<ref>స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు, ప్రచురణ 2010, పేజీ 209</ref> వివాహం అనంతరం [[హైదరాబాదు]]లోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళింది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.<ref>నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, సీహె ఆచార్య, కాటం రమేష్,2001 ప్రచురణ</ref> 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.<ref>[http://www.suryaa.com/features/article-2-107284 ఎగసిన అగ్నికెరటం ఆరుట్ల కమలాదేవి - సూర్య పత్రిక, నవంబరు 5, 2012]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/ఆరుట్ల_కమలాదేవి" నుండి వెలికితీశారు